కవ్వాల్ పర్యాటకంగా అభివృద్ధి చెందాలి
ABN, Publish Date - Dec 17 , 2023 | 10:24 PM
కవ్వాల టైగర్ జోన్ పర్యాటకంగా అభివృద్ధి చెందితేనే అడవికి గుర్తింపు లభిస్తుందని, వన్యప్రాణుల సంఖ్య పెరగాలంటే అడవిలో అలికిడి ఉండకూడదని మహారాష్ట్ర యావత్‌మల్‌కు చెందిన వైల్డ్‌లైఫ్ వార్డెన్ విరాణి అన్నారు.
జన్నారం, డిసెంబరు 17: కవ్వాల టైగర్ జోన్ పర్యాటకంగా అభివృద్ధి చెందితేనే అడవికి గుర్తింపు లభిస్తుందని, వన్యప్రాణుల సంఖ్య పెరగాలంటే అడవిలో అలికిడి ఉండకూడదని మహారాష్ట్ర యావత్‌మల్‌కు చెందిన వైల్డ్‌లైఫ్ వార్డెన్ విరాణి అన్నారు. ఆదివారం టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ టీడీసీ కేంద్రంలో డివిజన్ అటవీ శాఖ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అడవి అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ జరగాలంటే స్ధానికులతో పాటు అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులతో సత్సంబంధాలు ఉండాలని, వారి సహ కారంతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందితే నే ఇక్కడి ప్రాంతానికి గుర్తింపు లభిస్తుందన్నారు. అదే విధంగా కవ్వాల టైగ ర్ రిజర్వులో ఉండే సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎఫ్‌ఆర్‌వో హఫీజుద్దీన్, డివిజన్ అటవీ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 10:24 PM