ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫలితాలపై పోస్టుమార్టం

ABN, First Publish Date - 2023-12-04T22:28:05+05:30

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు పోస్టుమార్టం ప్రారంభించాయి. ఓటింగ్‌కు ముందు రోజు వరకు తమకు అనుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేసిన ఆయా పార్టీల అభ్యర్థులకు ఊహించని రీతిలో షాక్‌ తగి లింది.

మంచిర్యాల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు పోస్టుమార్టం ప్రారంభించాయి. ఓటింగ్‌కు ముందు రోజు వరకు తమకు అనుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేసిన ఆయా పార్టీల అభ్యర్థులకు ఊహించని రీతిలో షాక్‌ తగి లింది. ఓటుకు రూ.1000 చొప్పున నగదు పంచడంతోపాటు చీరలు, ఇతర విలువైన వస్తువులు అందజేసినా ఓటరు తన తీర్పును మార్చుకోలేదు. ఫలితంగా జిల్లాలో మహామహులు ఓటమి పాలవ్వడం చర్చనీయాం శంగా మారింది. ఎన్నడూ లేనంత చిత్తుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మదనపడుతున్నారు. లోపం ఎక్కడుందో అన్వేషించే పనిలో పడ్డారు. దీనికి తోడు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌, బీజేపీలలో చేరిన వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పార్టీ మారిన వారిలో కొందరు ముఖ్య నాయకులు ఉండటంతో వారంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.

ప్రణాళికలకు విరుద్ధంగా తీర్పు

ఎన్నికల సమయంలో అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ఎవరికి వారే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకున్నారు. సీనియర్ల సలహాలు, సూచనలతో వ్యూహరచన చేశారు. తీరా ఫలితాలు వారి అంచనాలకు విరుద్ధంగా రావడంతో పునరాలోచనలో పడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు నేరుగా ఓటర్లను కాకుండా ఆయా ప్రాంతాల్లోని వివిధ కమిటీలను నమ్ము కోవడంతో మొదటికే మోసం వచ్చినట్లయింది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా వివిధ సంఘాలపైనే అభ్యర్థులు పూర్తిగా ఆధారపడ్డారు. ఆయా పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.500 నుంచి రూ.1000 చొప్పున పంచార నేది బహిరంగ రహస్యం. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల్లో పెద్ద మొత్తంలో ఓటర్ల పేరిట నగదు పంపిణీ జరిగింది. అయితే నగదు నేరుగా ఓటర్లకు అందకపోవడంతో అభ్యర్థుల అంచనాలు తలకిం దులయ్యాయి. కమిటీలను విశ్వసించిన అభ్యర్థులు వారి తరుపున ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆ సంఖ్యకు సరిపడా నగదు అందజేశారు. అయితే కమి టీల సభ్యులు నగదును పంచకుండా సొంతానికి వినియోగించుకున్నా రన్న అభియోగాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున వీచిన కాంగ్రెస్‌ గాలి సైతం ఇతర పార్టీల అభ్యర్థుల అంచనాలను తారు మారు చేశాయి. దీంతో ఆయా పార్టీ అభ్యర్థుల్లో అంతర్మథనం మొదలైంది.

మూడో స్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌

మంచిర్యాల నియోజకవర్గంలో ఊహించని రీతిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు ఓటమి పాలయ్యారు. నాలుగు పర్యాయాలు ఎమ్మె ల్యేగా పని చేసిన ఆయనకు, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ ఉంటుందనే ప్రచారం జరిగింది. ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా పెద్దగా మెజార్టీ రాదని, ఐదు వేలలోపే సరిపెట్టుకోవలసి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తీరా ఫలితాలు వెలువడ్డాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మూడో స్థానానికి పడిపోవడంతో విశ్లేషకులు సైతం కంగుతిన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎన్నడూ లేనంతగా భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావుకు 1,04,260 ఓట్లు పోల్‌ కాగా, బీఆర్‌ ఎస్‌ అభ్యర్థికి కేవలం 37,734 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో ఊహించని రీతిలో ఫలితాలు రాగా, బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్‌కు 39,370 ఓట్లు రావడం గమనార్హం.

అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ

మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సంఖ్యలో ఓట్లు వేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగిన సీనియర్‌ నేత ముల్కల్ల మల్లారెడ్డికి 14వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అనంతరం 2018లో పోటీ చేసిన వెరబెల్లి రఘునాథ్‌కు కేవలం 5016 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని సవాలుగా తీసుకున్న రఘునాథ్‌ ఐదేళ్ళుగా ప్రజల మధ్యనే ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పి స్తానని హామీ ఇచ్చారు. విద్యావంతుడు కావడం, సొంతంగా కంపెనీలు కలిగి ఉండటంతోపాటు సహజంగానే రఘునాథ్‌కు ప్రజల్లో మంచి పేరు ఉంది. మరోవైపు ప్రధాని మోదీ పట్ల ప్రజలకు విశ్వాసం పెరగడం కూడా బీజేపీకి కలిసి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల బరిలోకి దిగిన ఆయనకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది. ఈ ఎన్నికల్లో ఆయకు 39,370 ఓట్లు పడ్డాయి. దీంతో రఘునాథ్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగింది. నియోజక వర్గంలో రెండో స్థానంలో నిలబెట్టింది.

కమిటీ సభ్యులతో ఆరా

ఓటర్ల పేరుతో ఎక్కడికక్కడే నగదు, ఇతర నజరానాలు అందజేసి నప్పటికీ మిశ్రమ ఫలితాలు రావడం పట్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పునరాలోచనలో పడ్డారు. వివిధ కమిటీల సభ్యులను పిలిపించుకొని జరిగిన నష్టంపై ఆరా తీసే పనిలో పడ్డారు. ఇప్పటికే కమిటీలు, ఇతర ద్వితీయ శ్రేణి నాయకులకు ఫోన్లు చేసినట్లు సమాచారం. దీంతో ఓటర్ల పేరుతో నగదు అందుకున్న పలువురి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. తమపై నమ్మకంతో ఓట్లు వేయించే బాధ్యతను అప్పగించి నప్పటికీ చేసిన సహాయ, సహకారాలు కూడా ఓట్లను రాల్చకపోవడంతో అభ్యర్థులు సంజాయిషీ కోరుతున్నట్లు సమాచారం.

Updated Date - 2023-12-04T22:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising