ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

ABN, Publish Date - Dec 26 , 2023 | 09:46 PM

పోలీసులు క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య సూచించారు. మంగళ వారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిం చారు.

తాండూర్‌, డిసెంబరు 26: పోలీసులు క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య సూచించారు. మంగళ వారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిం చారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. చట్టాలను పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల న్నారు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు, పెట్రోలింగ్‌ నిర్వహించాల న్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డయల్‌ 100 ఫిర్యాదుల పట్ల వేగంగా స్పందించాలని, రోజు ఉదయం, సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రజల మన్ననలు పొందే విధంగా పోలీసులు పనిచేయాలన్నారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, అదనపు ఎస్‌ఐ శ్రీనివాస్‌, పోలీసులు ఉన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 09:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising