ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:15 PM

నెన్నెల పోలీస్‌ స్టేషన్‌ను డీసీపీ సుధీర్‌ రామ్‌ నాథ్‌ కేకన్‌ సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణ లో ఏర్పాటు చేసిన గార్డెన్‌ను ప్రారంభించారు.

నెన్నెల, డిసెంబరు 18: నెన్నెల పోలీస్‌ స్టేషన్‌ను డీసీపీ సుధీర్‌ రామ్‌ నాథ్‌ కేకన్‌ సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణ లో ఏర్పాటు చేసిన గార్డెన్‌ను ప్రారంభించారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్యతో కలిసి పైళ్లను పరిశీలించారు. 5-ఎస్‌ అమలు తీరు, క్రైం రేట్‌, కేసుల నమోదు వివరాలను ఎస్సై శ్యామ్‌పటేల్‌ను అడిగి తెలుసుకున్నారు. పెం డింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందికి డీసీపీ సలహాలు, సూచనలిచ్చారు. పోలీసులు గ్రామీణ ప్రజలకు దగ్గర కావాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి మన్ననలు పొందా లన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేం దుకు చర్యలు చేపట్టాలన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. షీటీంల సేవలు మహిళలు సద్విని యోగం చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాలని డీసీపీ సూచిం చారు. బెల్లంపల్లి రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్‌ ఉన్నారు.

తాండూర్‌: పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఏసీపీ సదయ్య సూచించారు. సోమవారం తాండూర్‌ సర్కిల్‌ కార్యాల యాన్ని, మాదారం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌ పరిసరాలను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఏసీపీ మాట్లాడుతూ పోలీ స్‌స్టేషన్‌లో 5ఎస్‌ ఫంక్షన్‌ వర్టికల్స్‌ అయ్యేలా చూసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించవద్దని, వారిపై కఠినచర్యలు తీసుకో వాలన్నారు. రోజు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూడాలన్నారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాజశేఖర్‌, మాదారం ఎఎస్‌ఐలు హుస్సేన్‌, పెద్దయ్యలు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising