ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: సొంతింటి కల నెరవేరేనా?

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:19 PM

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌): పేద, మధ్యతరగతి ప్రజలను ఊరిస్తున్న సొంతింటి కల ఆసిఫాబాద్‌ ఏజెన్సీ ప్రాంతంలో 15ఏళ్లుగా అందని ద్రాక్షగానే మారింది. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో సొంతింటి నిర్మాణాల కోసం ఆదివాసులు 10ఏళ్లుగా అటు ఐటీడీఏ, ఇటు ప్రజాప్రతినిధులను సాయం కోసం ఎన్నిసార్లు అర్థించినా ఫలితం లేని పరిస్థితి.

- ఏళ్లుగా అందని ద్రాక్షలా మారిన గృహనిర్మాణ సాయం

- గృహలక్ష్మి పేరిట హడావుడి చేసి వదిలేసిన గత ప్రభుత్వం

- ఇందిరమ్మ పథకంపైనే పేదల ఆశలు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):

పేద, మధ్యతరగతి ప్రజలను ఊరిస్తున్న సొంతింటి కల ఆసిఫాబాద్‌ ఏజెన్సీ ప్రాంతంలో 15ఏళ్లుగా అందని ద్రాక్షగానే మారింది. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో సొంతింటి నిర్మాణాల కోసం ఆదివాసులు 10ఏళ్లుగా అటు ఐటీడీఏ, ఇటు ప్రజాప్రతినిధులను సాయం కోసం ఎన్నిసార్లు అర్థించినా ఫలితం లేని పరిస్థితి. గత ప్రభుత్వం డబుల్‌బెడ్‌ రూమ్‌ల పేరుతో ప్రతి నియోజకవర్గానికి 1250చొప్పున ఇండ్లను మంజూరు చేసింది. అయితే ఇందులో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో నిర్మించిన గృహసముదాయం మినహాయిస్తే ఏజెన్సీ ప్రాంతంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ గృహాల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఆసిఫాబాద్‌ జిల్లాలో గృహనిర్మాణ పథకంపై అధికారులతో సమీక్షించడంతో జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వేలాది లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వాస్తవానికి గత ప్రభుత్వం పదవీకాలం చివరలో గృహలక్ష్మి పేరిట దరఖాస్తులను స్వీకరించి హడావుడి చేసినా అవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని యథాతథంగా అమలు చేస్తుందా? లేక గత కాంగ్రెస్‌ హయాంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకం తరహాలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానానికి అనుగుణంగా పథకాన్ని ప్రారంభిస్తుందా? అనేదానిపై ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గత సెప్టెంబర్‌లో గృహలక్ష్మి పథకానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌ పద్ధతిలో స్వీకరించింది. ఇందులో ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి 335 గ్రామ పంచాయతీల పరిధిలో 35వేల పైచిలుకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదైనట్లు చెబుతున్నారు. అయితే అప్పట్లో కేవలం సొంతజాగా కలిగిన వారికి మాత్రమే గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తూ నిబంధనలు జారీచేశారు. ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం గిరిజనేతరులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.

ఇదీ గృహలక్ష్మి దరఖాస్తుల తీరు..

ఆసిఫాబాద్‌ జిల్లాలో గృహలక్ష్మి కోసం ఇప్పటివరకు మొత్తం 25వేల దరఖాస్తులు రాగా ఇందులో 23వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌ అయ్యాయి. ఏజెన్సీ మండలాలైన సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాలకు సంబంధించిన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా కేవలం గిరిజనులు, మైదాన ప్రాంత గ్రామాలకు చెందిన గిరిజనేతరుల దరఖాస్తుదారులవి మాత్రమే. ఏజెన్సీ గ్రామాల్లో తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో 50వేలకు పైనే దరఖాస్తులు వచ్చాయంటు న్నారు. ఇక మండలాల వారీగా నమోదైన దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే.. ఆసిఫాబాద్‌ మండలంలో 2300, రెబ్బెన 2200, వాంకిడి 2300, కెరమెరి 2200, జైనూర్‌ 800, తిర్యాణి 1000, కాగజ్‌నగర్‌ 4100, పెంచికలపేట్‌ 1500, సిర్పూర్‌(టి)800, కౌటాల 200, చింతల మానేపల్లి 1800, బెజ్జూర్‌ 2600, దహెగాం 1300చొప్పున నమోదయ్యాయి.

Updated Date - Dec 18 , 2023 | 10:19 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising