Kumaram Bheem Asifabad: హమాలీ కార్మికుల రేట్లు పెంచాలి
ABN, Publish Date - Dec 29 , 2023 | 10:09 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 29: సివిల్ సప్లయి హమాలీ కార్మికుల రేట్లను పెంచాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గోదాం ఆవరణలో హమాలీ కార్మికులతో సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 29: సివిల్ సప్లయి హమాలీ కార్మికుల రేట్లను పెంచాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గోదాం ఆవరణలో హమాలీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ 40సంవత్సరాలుగా హమాలీ కార్మి కులు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. ఈనెల31తో అగ్రిమెంట్ ముగుస్తుందని జనవరి1 నుంచి నూతన రేట్లను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్, కార్మికులు మోహన్, శ్రీనివాస్, కొమురక్క, తుకారాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2023 | 10:09 PM