ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: విద్యాబుద్ధులు నేర్పడమే లక్ష్యం..

ABN, First Publish Date - 2023-12-10T22:15:31+05:30

వాంకిడి, డిసెంబరు 10: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడమే లక్ష్యంగా బడిబయట పిల్లల సర్వేకు జిల్లా విద్యాశాఖ సన్నద్దమవుతోంది. ఈనెల 11వ తేదీ నుంచి నెల రోజుల పాటు పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేకు సమాయత్త మతున్నారు. ఇందుకోసం అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

- బడి బయట పిల్లల సర్వే

- సమాయత్తమవుతున్న విద్యాశాఖ

- నేటి నుంచి నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో సర్వే

వాంకిడి, డిసెంబరు 10: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడమే లక్ష్యంగా బడిబయట పిల్లల సర్వేకు జిల్లా విద్యాశాఖ సన్నద్దమవుతోంది. ఈనెల 11వ తేదీ నుంచి నెల రోజుల పాటు పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేకు సమాయత్త మతున్నారు. ఇందుకోసం అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్‌పీలు, ఐఈఆర్‌పీలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ప్రత్యేక అధికారులు ఇందులో భాగస్వాములై బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించనున్నారు. బడిబయట ఉన్న పిల్లల సర్వేలో ప్రధానంగా 6 నుంచి 14సంవత్సరాలలోపు వయసు ఉండి బడిబాట పట్టని వారితో పాటు 14 సంవత్సరాల పైబడిన 19సంవత్సరాల లోపు ఉన్న వారిని గుర్తించనున్నారు. ఐదు సంవత్సరాలు నిండి ఉండి అసలే బడిలో చేరని పిల్లలు, బడి ఈడు ఉండి బడిలో చేరని పిల్లలు, వరుసగా30 రోజుల పాటు బడికి వెళ్లకుండా డ్రాప్‌అవుట్‌ ఉన్నవారిని వెతికి బడిబాట పట్టించడం, పాఠశాలల్లో చేర్పించడం వంటివి చేయ నున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పనులు చేసుకునే కుటుంబాల పిల్లలు, ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి పనులు చేసే కుంటుబాల పిల్లలను ఇందులో పరిశీలన చేయనున్నారు. ఈ నెల11 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ సర్వే చేపట్టనున్నారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందిచనున్నారు.

- వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది..

వలస కార్మికుల్లో ఎక్కువగా బడిబయట ఉన్న పిల్లలు, బాల కార్మికులు కనిపిస్తారు. సీజనల్‌గా వచ్చి మూడు నెలలు పనిచేసి వలస కార్మికులు వెళ్లిపోతారు. వారి కుటుంబాలు ఇక్కడ పనులకు వచ్చినప్పుడు వెంట తమ పిల్లలను తీసుకొచ్చి పనులు పూర్తయ్యాక తిరిగి తీసుకెళ్తుంటారు. ఇలా వలస వచ్చిన కార్మికుల పిల్లలు చదు వుకు దూరమయ్యే అవకాశాలు ఉంటుంన్నాయి. అలాంటి వలస కుటుంబాల వారి పిల్లల గురించి ఆరాతీసి వారిని పాఠశాలల్లో చేర్పిచేందుకు చర్యలు తీసుకుంటారు.

-జిల్లాలో పాఠశాలలు..

జిల్లాలో మొత్తం 1258పాఠశాలలు ఉండగా ఇందులో 15 కస్తూర్బాలున్నాయి. వీటిలో 53వేలకు పైగా విద్యార్థులు చదువు తున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, తల్లి దండ్రుల్లో అవగాహన లేమి కారణంగా జిల్లాలో బడిబయటి పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అనేక గ్రామాల్లో పదో తరగతి తరువాత చదువులు మానేస్తున్న వారు కూడా అధికంగా ఉన్నారు. ప్రస్తుత సర్వేలో ఇలాంటి వారందరిని గుర్తించేందుకు విద్యాశాఖ కార్యచరణ రూపొందించింది.

- పకడ్బందీగా సర్వే..

- మనుకుమార్‌, ఎంఈవో

బడిబయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు ఈనెల 11నుంచి నెల రోజుల పాటు సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బడిఈడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం, డ్రాప్‌అవుట్‌లను గుర్తించడం, బడిబాట పట్టని వారిని గుర్తించి బడుల్లో చేర్పించేలా చర్యలు తీసకుంటాం. షెడ్యూల్‌ ప్రకారం సర్వేపూర్తి చేసేలా సీఆ ర్పీలకు ఆదేశాలున్నాయి. ఎప్పటిప్పుడు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం.

Updated Date - 2023-12-10T22:15:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising