ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: ముక్కోటికి సిద్ధమైన ఆలయాలు

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:21 PM

బెజ్జూరు, డిసెంబరు 22: మండలకేంద్రంలోని రంగనాయక ఆలయం ముక్కోటి ఏకాదశికి సిద్ధ మైంది. శనివారం నిర్వహించే ముక్కోటి ఏకాదశికి వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నా మని

కుమరం భీం ఆసిఫాబాద్‌ : ముక్కోటికి సిద్ధమైన ఆలయాలు

బెజ్జూరు, డిసెంబరు 22: మండలకేంద్రంలోని రంగనాయక ఆలయం ముక్కోటి ఏకాదశికి సిద్ధ మైంది. శనివారం నిర్వహించే ముక్కోటి ఏకాదశికి వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నా మని ఆలయకమిటీ అధ్యక్షుడు తంగడిపల్లి మహేష్‌ అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం లో కుంకుమ పూజ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తి దర్శనం చేసు కుంటారని అన్నారు. మార్గశిరంలో ప్రతీరోజు ఓ విశేషం ఉంటుం ది. అదీగాక మండల కేంద్రంలో కొలువైన రంగనాయక ఆలయం వందల ఏళ్ల క్రితం నిర్మించినది. ఇక్కడి స్వామి దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో శుక్రవారం వివిధ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక లక్ష్మినారా యణస్వామి ఆలయంలో ధ్వజారోహణము, కళశస్థాపన, కుంకుమ పూజ, రంగవల్లిక తదితర కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

Updated Date - Dec 22 , 2023 | 11:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising