ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: ‘మహాలక్ష్మి’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2023-12-10T22:13:44+05:30

కాగజ్‌నగర్‌, డిసెంబరు 10: రాష్ట్ర ప్రభుత్వం మహిళ కోసం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ బస్టాండులో ఆయన ఈ పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

- కలెక్టర్‌ హేమంత్‌ బొర్కడే

కాగజ్‌నగర్‌, డిసెంబరు 10: రాష్ట్ర ప్రభుత్వం మహిళ కోసం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ బస్టాండులో ఆయన ఈ పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సౌకర్యార్థం ఆర్టీసీబస్సుల్లో ప్రయాణించేందుకు ఉచితసౌకర్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ప్రయాణించే మహి ళలు తప్పకుండా ఆధార్‌కార్డు చూపించాలన్నారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ ఉచిత ప్రయాణ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బస్సులోనే కలెక్టర్‌ హేమంత్‌ బొర్కడే, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు ప్రయాణించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్డీవో సురేష్‌, డీవోఏ ప్రమోద్‌, ఆర్టీసీ డీఎం ఎ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T22:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising