ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: ప్రజల రుణం తీర్చుకుంటా: ఎమ్మెల్యే కోవలక్ష్మి

ABN, First Publish Date - 2023-12-03T23:49:38+05:30

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 3: తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆదివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మి 22,810 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆజ్మీర శ్యాంనాయక్‌పై విజయం సాధించారు.

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 3: తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆదివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మి 22,810 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆజ్మీర శ్యాంనాయక్‌పై విజయం సాధించారు. గెలుపొందిన అనంతరం కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వచ్చిన కోవ లక్ష్మి విజయ సంకేతాన్ని చూపి అనంతరం మాట్లాడారు. తనను ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించిన ఆసిఫాబాద్‌ నియో జకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ విజయోత్సవ ర్యాలీ..

ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ నుంచి కోవ లక్ష్మి ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కౌంటింగ్‌ కేంద్రం నుంచి డీజే సౌండ్‌తో నృత్యాలు చేస్తూ టపాసులు పేల్చుతూ పట్టణంలోని ప్రధానవీధుల గుండా భారీప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కోవ లక్ష్మి నివాసం వరకు కొనసాగింది. ఈ విజయోత్సవర్యాలీలో నియోజకవర్గంలోని 10మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T23:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising