Kumaram Bheem Asifabad: జైలు జీవితంతో ఖైదీల్లో పరివర్తన రావాలి
ABN, First Publish Date - 2023-11-04T22:38:48+05:30
ఆసిఫాబాద్, నవంబరు 4: జైలు జీవితంతో ఖైదీల్లో పరివ ర్తన రావాలని జిల్లా లీగల్ సర్వీ సెస్ అథారిటీ చైర్మన్, జిల్లా జడ్జి ఎంవీ రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్‌జైలులో నిర్వ హించిన లీగల్ సర్వీసెస్ అథా రిటీ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఖైదీలకు అంది స్తున్న సౌకర్యాలను అడిగి తెలు సుకున్నారు.
- జిల్లా జడ్జి ఎంవీ రమేష్
ఆసిఫాబాద్, నవంబరు 4: జైలు జీవితంతో ఖైదీల్లో పరివ ర్తన రావాలని జిల్లా లీగల్ సర్వీ సెస్ అథారిటీ చైర్మన్, జిల్లా జడ్జి ఎంవీ రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్‌జైలులో నిర్వ హించిన లీగల్ సర్వీసెస్ అథా రిటీ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఖైదీలకు అంది స్తున్న సౌకర్యాలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైలు జీవితం ఖైదీలో పరివర్తన తీసుకు రావాలని అన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల ఒక కుటుంబం రోడ్డున పడుతుందని అన్నారు. జైలులో నేర్చుకున్న పలు మంచి అంశాలు నిత్య జీవితంలో వర్తింపజేసుకోవాలని సూచించారు. నేర ప్రవృత్తి వల్ల సమాజంలో గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. చట్టాలపై ఖైదీలు అవగాహన కలిగిఉండాలని అన్నారు. కక్షిదారులు కూర్చుని మాట్లాడుకుంటే అనేక అంశాలకు పరిష్కారాలు దొరుకుతాయని తెలిపారు. ప్రతివ్యక్తి మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. దీనివల్ల పనిపై శ్రద్ధ పెరగడంతోపాటు తప్పులు చేసే అవకాశం తగ్గుతుందన్నారు. మంచిచెడులను బెరీజు వేసుకొనే శక్తి వస్తుందన్నారు. అంతకు ముందు జైలు సిబ్బంది జిల్లాజడ్జికి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో జైలు అధికారి ప్రేంకుమార్, అడ్వకేట్లు చంద్రకుమార్, నరహరి, గణేష్, రాజీవ్‌రెడ్డి, లీగల్ అసిస్టెంట్ అంజనీదేవి, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-11-04T22:38:49+05:30 IST