ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: ధాన్యం కొనుగోలు కేంద్రాల జాడేది?

ABN, First Publish Date - 2023-12-04T22:27:00+05:30

దహెగాం, డిసెంబరు 4: ఒకవైపు మిచౌగ్‌ తుఫాను, అకాల వర్షాలు, మరోవైపు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారం భించకపోవడంతో రైతు లు ఆందోళన చెందు తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వరిపంట తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

- గుబులు పుట్టిస్తున్న మిచౌగ్‌ తుఫాన్‌

- ఆందోళనలో రైతులు

దహెగాం, డిసెంబరు 4: ఒకవైపు మిచౌగ్‌ తుఫాను, అకాల వర్షాలు, మరోవైపు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారం భించకపోవడంతో రైతు లు ఆందోళన చెందు తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వరిపంట తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. వరికోతలు పూర్తై నెలకు పైగా గడస్తున్నా కొనుగోలు కేంద్రాల జాడే లేదని రైతులు ఆవేధన వ్యక్తంచేస్తున్నారు. దహెగాం మండల వ్యాప్తంగా వరికోతలు 40 శాతానికి పైగా పూర్తైంది. ధాన్యం స్థానిక మిల్లులతోపాటు జిల్లా దాటి వేరే జిల్లాకు తరలిపో తోంది. వ్యాపారులు కేవలం రూ.1700 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. జిల్లా అధి కారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

ధాన్యం కొనుగోలు లక్ష్యం ఇలా..

జిల్లా వ్యాప్తంగా వానాకాలం వరి పంటకు సంబంధించి 15మండలాల్లో సుమారు 55వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. దహెగాం మండల వ్యాప్తంగా 9840 ఎక రాల్లో వరి పంటను సాగు చేయగా జిల్లాలో 30వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 40వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం అధి కారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘ఏ’ గ్రేడ్‌ క్వింటాలుకు రూ.2200, ‘బి’ గ్రేడ్‌కు రూ.2180 చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది.

ప్రైవేటు వ్యాపారులే దిక్కు..

- సుంకరి పోశన్న, రైతు

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకుంటు న్నాం. క్వింటాలుకు రూ.1700 ఇస్తున్నారు. దీనిపై ఎవరూ స్పందించడం లేదు.

అకాల వర్షంతో భయం..

- మోరె సత్తయ్య, రైతు

తుఫాన్‌ కారణంగా వర్షా లతో ఇబ్బందులు పడు తు న్నాం. కల్లంలో ధాన్యం ఆర బోసి రాశులుగా పోయడం ఇబ్బంది మారింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవ డంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నాం.

త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం..

- జీవీ నర్సింహారావు, సివిల్‌ సప్లయి డీఎం

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తాం. కేంద్రాలను ప్రారంభించడం ఆలస్య మైన మాట వాస్తవమే. రైతులు ఆందోళన చెందవద్దు. తక్కువ ధరకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలి.

Updated Date - 2023-12-04T22:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising