Kumaram Bheem Asifabad: ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలి: ఎమ్మెల్యే హరీష్‌బాబు
ABN, Publish Date - Dec 18 , 2023 | 10:16 PM
కౌటాల, డిసెంబరు 18: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సోమవారం మండంలోని సాండ్‌గాం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు
కౌటాల, డిసెంబరు 18: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సోమవారం మండంలోని సాండ్‌గాం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎటు వంటి కోతలేకుండా కొనుగోలు చేయాలని అధికారు లకు సూచించారు. అధికారులందరు రైతాంగాభివృ ద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏవో రాజేష్, ఏపీఎం వెంకటరమణ, ఏఈవో శ్రీకన్య, బీజేపీ నాయకులు రాజేందర్‌గౌడ్, సర్పంచ్ దామో దర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి): ఎలాంటి కోతలు లేకుండా రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సోమవారం మండలంలోని లోనవెల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేను ఐకేపీ ఏపీఎం దుర్గయ్య, సిబ్బంది సన్మానించారు. కార్యక్రమం లో తహసీల్దార్ శ్రీనివాస్, ఏడీఏ రామకృష్ణ, ఏఈవో శ్రీనివాస్, ఏపీఎం దుర్గయ్య, జడ్పీటీసీ రేఖ, నాయకులు ఉన్నారు.
పరామర్శ..
కౌటాల/చింతలమానేపలి: కౌటాల మాజీ ఎంపీటీసీ రత్నంబావూజీ, చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన బుచ్చ పోచ మల్లు ఇటీవల మృతిచెందగా వారి కుటుంబీకులను సోమవారం ఎమ్మెల్యే పాల్వాయిహరీష్ బాబు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
Updated Date - Dec 18 , 2023 | 10:16 PM