Kumaram Bheem Asifabad: ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలి: ఆర్డీవో
ABN, Publish Date - Dec 28 , 2023 | 10:35 PM
సిర్పూర్(యు), డిసెంబరు 28: సంక్షేమపథకాలు అర్హులకు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఆర్డీవో కదం సురేష్ అన్నారు. గురువారం ఆయన మండలం లోని రాఘపూర్, భూర్నూర్, మహగాం తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపా లన సదస్సులను పరిశీలించారు.
సిర్పూర్(యు), డిసెంబరు 28: సంక్షేమపథకాలు అర్హులకు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఆర్డీవో కదం సురేష్ అన్నారు. గురువారం ఆయన మండలం లోని రాఘపూర్, భూర్నూర్, మహగాం తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపా లన సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 6వరకు గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో మధుసుదన్ పాల్గొన్నారు.
లింగాపూర్: ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ ఆర్డీవో సురేష్ కదం గురు వారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు అధికారులకు అందజేస్తున్న దరఖా స్తులను పరిశీలించారు. పూర్తి చేసిన దరఖాస్తులను పరిశీలించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకుచర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో తొలి రోజు 70దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో ప్రసాద్ పేర్కొ న్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, ఎంపీపీ సవితబాయి, జడ్పీటీసి రక్కాబాయి, వైస్ ఎంపీపీ ఆత్మరాం, ఎంపీవో ఉమర్ శరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 10:35 PM