ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:01 AM
నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి తెలిపారు. బుధవారం చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు.
చెన్నూరు, డిసెంబరు 27: నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి తెలిపారు. బుధవారం చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం వార్డులను సందర్శించి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి రావడం కిడ్నీ బాధితులకు వరమని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రంలో విడతల వారీ గా అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. వైద్యులు పేద ప్రజలకు అందు బాటులో ఉండి మెరుగైన సేవలందించాలన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. డీసీహెచ్ అరవింద్, వైద్యులు సత్య నారాయణ, మున్సిపల్ చైర్మన్ అర్చనరాంలాల్‌గిల్డా, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 12:01 AM