ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WhatsApp Update: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్స్.. కానీ చాట్‌లకు పెద్ద దెబ్బ.. ఏమిటది?

ABN, First Publish Date - 2023-11-16T15:08:51+05:30

WhatsApp: తన ‘వాట్సాప్’ వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించడం కోసం మెటా సంస్థ కొత్తకొత్త ఫీచర్లను ఒక్కొక్కటిగా తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ.. లేటెస్ట్‌గా చేయబోయే మార్పులు మాత్రం యూజర్లకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.

తన ‘వాట్సాప్’ వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించడం కోసం మెటా సంస్థ కొత్తకొత్త ఫీచర్లను ఒక్కొక్కటిగా తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ.. లేటెస్ట్‌గా చేయబోయే మార్పులు మాత్రం యూజర్లకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. చాట్స్ బ్యాకప్ విషయంలో అది ప్రభావితం చేయవచ్చు. వచ్చే నెల.. అంటే డిసెంబర్ నుంచి వాట్సాప్ బ్యాకప్‌లు, మీ గూగుల్ ఖాతాలోని నిల్వ పరిమితితో లెక్కించబడతాయి. అంటే.. వాట్సాప్ మెసేజ్‌లు (ఫోటోలు, వీడియోలు సహా) ఇకపై గూగుల్ స్టోరేజ్ మీద ఆధారపడతాయి.

ఈ లెక్కన.. మీ వాట్సాప్ బ్యాకప్ కావాలంటే, గూగుల్ ఖాతాలో తగినంత ఖాళీ స్థలాన్ని ప్రత్యేకంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ సమస్య కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకే ఉంటుంది. ఐఫోన్ యూజర్లకు బ్యాకప్ కోసం ‘ఐక్లౌడ్’ ఉంది. గూగుల్ ఖాతాలో మనకు డీఫాల్ట్‌గానే 15 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఆ స్టోరేజ్‌లో నుంచే కొంత స్పేస్‌ని వాట్సాప్ బ్యాకప్‌ల కోసం తప్పకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 15 జీబీ స్టోరేజ్ అయిపోతే మాత్రం.. ‘గూగుల్ వన్’ స్టోరేజ్ ప్లాన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ‘వాట్సాప్ బీటా’ వినియోగదారులకు ఈ కొత్త మార్పుకి సంబంధించిన హెచ్చరిక డిసెంబర్‌లో చాట్ బ్యాకప్ పేజీలో కనిపిస్తుంది.


ఆ సంగతి అలా ఉంచితే.. గ్రూప్ చాట్ విషయంలోనూ వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ కొత్త ఫీచర్ ఏమిటంటే.. గ్రూప్ చాట్‌లో ఇతరులకు ఎలాంటి అంతరాయం కలిగించకుండానే, ఇద్దరు వ్యక్తులు వాయిస్ కాల్‌లో మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఇతరులు కూడా ఆ కాల్‌లో చేరాలంటే కూడా చేరొచ్చు. ఈ కొత్త ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలంటే.. తొలుత వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌కి వెళ్లాలి. గ్రూప్ చాట్ పేరు పక్కన కొత్తగా వేవ్ ఐకాన్ ఉంటుంది. దానిపై నొక్కగానే.. వాయిస్ చాట్ ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది. ఇతర గ్రూప్ సభ్యులు కూడా ఈ వాయిస్ కాల్‌లో చేరొచ్చు.

Updated Date - 2023-11-16T15:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising