ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WhatsApp new feature: టైం సేవ్ చేయనున్న వాట్సప్.. అద్దిరిపోయే ఫీచర్‌తో వచ్చిందిగా

ABN, First Publish Date - 2023-09-12T17:18:35+05:30

వినియోగదారులకు న్యూ ఫీచర్స్ అందిస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ లో ఉండే వాట్సప్(Whatsup) త్వరలో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఈయూ(European Union) తీసుకొచ్చిన డిజిటల్ మార్కెట్స్ యాక్ట్( DMA) ప్రకారం.. ఏ యాప్ అయినా ఇతర యాప్ యూజర్లతో మెసేజ్ చేసేందుకు వీలుగా ఉండాలి.

వినియోగదారులకు న్యూ ఫీచర్స్ అందిస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ లో ఉండే వాట్సప్(Whatsup) త్వరలో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఈయూ(European Union) తీసుకొచ్చిన డిజిటల్ మార్కెట్స్ యాక్ట్(డీఎంఐ) ప్రకారం.. ఏ యాప్ అయినా ఇతర యాప్ యూజర్లతో మెసేజ్ చేసేందుకు వీలుగా ఉండాలి. అలా ఉంటేనే అవి యాంటి కాంపిటీటివ్ బిహేవియర్ కిందకు రావు. అలాంటి నిబంధనే వాట్సప్ కి ఈ కొత్త ఫీచర్ యాడ్ అయ్యేలా చేసింది. వాట్సప్ యూజర్లు ఇతర యాప్ లను ఉపయోగించే యూజర్లతో డైరెక్టు మెసేజ్(Messaging) చేసే ఫీచర్(Feature)ను అందుబాటులోకి తీసుకురావాలి. ఈ నిబంధనలతో చాట్స్ ఫీచర్ ని వాట్సప్ టెస్టు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే వాట్సప్ యూజర్లు, వేరే యాప్ యూజర్లతో నేరుగా మెసేజ్ చాట్ చేయొచ్చు.


ఐరోపా సమాఖ్య నిబంధనలు అమలు చేయాలనే ఈ ఫీచర్ తెస్తున్న వాట్సప్ కి ఇది ఏ మాత్రం ఇష్టం లేదని నిపుణులు అంటున్నారు. మల్టిపుల్ ప్లాట్ ఫాం యూజర్లు(Multiple Platform Users) ఇంటరాక్ట్ కావడం కష్టమవుతుండటంతో, వారు ఈజీగా చాట్(Chat) చేసుకునేలా, సమయం ఆదా అయ్యేలా ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ఇది అందుబాటులోకి వస్తే టెలిగ్రామ్( Telegram) తదితర మెసేజింగ్ ప్లాట్ ఫామ్ లను ఉపయోగించే యూజర్లకు వాట్సప్ వినియోగించేవారు నేరుగా మెసేజ్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ఫస్ట్ ఐరోపా(Europe) దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్ సహా ఇతర దేశాల్లో నిబంధనలేమీ లేవు కాబట్టి ఈ ఫీచర్ మన వరకు రాకపోవచ్చు. త్వరలో ఇదే అంశంపై మెటా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2023-09-12T17:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising