Under-19 Asia Cup : అండర్-19 ఆసియా కప్ విజేత బంగ్లా
ABN, Publish Date - Dec 18 , 2023 | 04:00 AM
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ తొలిసారి అండర్-19 ఆసియాకప్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లా 195 పరుగుల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. తొలుత
దుబాయ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ తొలిసారి అండర్-19 ఆసియాకప్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లా 195 పరుగుల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. తొలుత బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. అషికుర్ రహ్మాన్ (129) సెంచరీ చేయగా.. రిజ్వాన్ (60), ఆరిఫుల్ ఇస్లాం (50) రాణించారు. ఐమన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో యూఏఈ 24.5 ఓవర్లలో 87 రన్స్‌కే కుప్పకూలింది.
Updated Date - Dec 18 , 2023 | 06:57 AM