Dean Elgar : కెరీర్ ఆఖరి టెస్టు.. ఎల్గర్‌కే జట్టు పగ్గాలు
ABN, Publish Date - Dec 30 , 2023 | 04:36 AM
దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ తన ఫేర్‌వెల్ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి మూడో తేదీ నుంచి భారత్‌తో జరిగే రెండో టెస్టుకు
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ తన ఫేర్‌వెల్ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి మూడో తేదీ నుంచి భారత్‌తో జరిగే రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ బవుమా గాయంతో దూరమయ్యాడు. తొలి టెస్టు తొలి రోజే ఫీల్డింగ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో బవుమా మైదానం వీడాడు. దీంతో రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న ఎల్గర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. భారత జట్టు 2021-22లో దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ఎల్గర్ కెప్టెన్సీలోనే 2-1తో సిరీస్ గెలవడం విశేషం.
Updated Date - Dec 30 , 2023 | 04:36 AM