ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆసీస్‌తో టీ20లకు సూర్యకు పగ్గాలు

ABN, First Publish Date - 2023-11-21T02:37:16+05:30

ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సలో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించనున్నాడు. సోమవారం ఇక్కడ సమావేశమైన సెలెక్టర్లు భారత జట్టును...

23న విశాఖలో తొలి మ్యాచ్‌

అహ్మదాబాద్‌: ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సలో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించనున్నాడు. సోమవారం ఇక్కడ సమావేశమైన సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. గురువారం విశాఖలో తొలి మ్యాచ్‌ జరగనుంది. కెప్టెన్సీ కోసం శ్రేయాస్‌ అయ్యర్‌ పేరును కూడా పరిశీలించినా.. కొన్ని నెలలుగా తీరికలేని క్రికెట్‌ ఆడుతున్న నేపథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లకు అతడికి విశ్రాంతినివ్వాలని నిర్ణయించారు. రాయ్‌పూర్‌, బెంగళూరుల్లో జరిగే ఆఖరి మ్యాచ్‌లకు అయ్యర్‌ జట్టులోకి వస్తాడు. కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యవహరించనున్నాడు. గాయం నుంచి కోలుకొన్న అక్షర్‌ పటేల్‌ మళ్లీ జట్టులో చోటు దక్కించుకొన్నాడు. తిలక్‌ వర్మ టీమ్‌లో స్థానం నిలబెట్టుకోగా.. ఐర్లాండ్‌తో సిరీ్‌సలో ఆడిన సంజూ శాంసన్‌కు సెలెక్టర్లు మొండిచేయి చూపారు. వరల్డ్‌కప్‌ టీమ్‌లోని ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా ఈ సిరీ్‌సకు ఎంపికయ్యారు.

టీ20 జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, ముకేష్‌ కుమార్‌.

Updated Date - 2023-11-21T02:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising