ప్రపంచకప్ రగ్బీ విజేత దక్షిణాఫ్రికా
ABN, First Publish Date - 2023-10-30T02:17:25+05:30
డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా రగ్బీ ప్రపంచక్‌పలో మరోసారి అదరగొట్టింది. ఈ మెగా టోర్నమెంట్‌లో టైటిల్ నిలబెట్టుకుంటూ విజేతగా నిలిచింది..
పారిస్: డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా రగ్బీ ప్రపంచక్‌పలో మరోసారి అదరగొట్టింది. ఈ మెగా టోర్నమెంట్‌లో టైటిల్ నిలబెట్టుకుంటూ విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 12-11 స్కోరు తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. రగ్బీ చరిత్రలో ఇప్పటివరకూ పది వరల్డ్‌క్‌పలు జరుగగా దక్షిణాఫ్రికా అత్యధికంగా నాలుగు సార్లు టైటిల్ గెల్చుకుంది. ఇక న్యూజిలాండ్ 3, ఆస్ర్టేలియా 2, ఇంగ్లండ్ ఒకసారి కైవసం చేసుకున్నాయి.
Updated Date - 2023-10-30T02:17:44+05:30 IST