ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Southafrica: తొలి వన్డేలో టీమిండియా సంచలనం.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే..

ABN, Publish Date - Dec 17 , 2023 | 04:20 PM

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జోహనెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య సౌతాఫ్రికాను కేవలం 116 పరుగులకే ఆలౌట్ చేశారు.

జోహనెస్‌బర్గ్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జోహనెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య సౌతాఫ్రికాను కేవలం 116 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత పేసర్లు అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ చెలరేగడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. వరుస విరామాల్లో వికెట్లను చేజార్చుకున్నారు. అర్షదీప్ సింగ్ 5 వికెట్లు, అవేశ్ ఖాన్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌ను కకావికలం చేశారు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశాడు.

కాగా దక్షిణాఫ్రికా బ్యాటర్లలో 33 పరుగులు చేసిన ఆండిలే ఫెహ్లుక్వాయో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత టోనీ డి జోర్జి(28), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఓపెనర్ రీజా హెండ్రింగ్స్ (0), వాండర్ డసెన్ (0), హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), వియాన్ ముల్డర్ (0), కేశవ్ మహారాజ్ (4), నాండ్రే బర్గర్ (7), తబ్రీజ్ షంషీ(11 నాటౌట్) చొప్పున ఘోరంగా విఫలమయ్యారు. మొత్తం భారత బౌలర్ల ధాటికి 27.3 ఓటర్లలోనే దక్షిణాఫ్రికా ఆలౌట్ అవడం గమనార్హం.

Updated Date - Dec 17 , 2023 | 04:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising