రన్నరప్.. కృష్ణప్రసాద్ జోడీ
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:55 AM
ఒడిశా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు షట్లర్ కృష్ణప్రసాద్-సాయి ప్రతీక్ జోడీ డబుల్స్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కృష్ణప్రసాద్ జంట 22-20, 18-21, 17-21తో లిన్- సు
కటక్: ఒడిశా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు షట్లర్ కృష్ణప్రసాద్-సాయి ప్రతీక్ జోడీ డబుల్స్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కృష్ణప్రసాద్ జంట 22-20, 18-21, 17-21తో లిన్- సు చింగ్ (తైపీ) జోడీ చేతిలో ఓడింది. అశ్విని-తనీషా జోడీ 21-14, 21-17తో మెయిలిసా-రోస్ (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గగా, ధ్రువ్-తనీషా జంట 21-17, 19-21, 23-21తో యాంగ్-జెస్సికా (ఇండోనేసియా) జోడీని ఓడించి మిక్స్‌డ్ విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్ 21-18, 19-21, 21-14తో ఆయుష్‌పై గెలిచి టైటిల్ అందుకున్నాడు.
Updated Date - Dec 18 , 2023 | 03:55 AM