రోహిత్ ఆటతీరు మారాలి
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:34 AM
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సలో కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆటతీరును మార్చుకోవాల్సి ఉంటుందని మాజీ కెప్టెన్ గవాస్కర్ తెలిపాడు. ‘
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సలో కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆటతీరును మార్చుకోవాల్సి ఉంటుందని మాజీ కెప్టెన్ గవాస్కర్ తెలిపాడు. ‘వన్డే ఫార్మాట్‌లో తొలి పది ఓవర్లపాటు వీలైనన్ని పరుగులు చేసేందుకు రోహిత్ ఎదురుదాడిని నమ్ముకుంటాడు. కానీ టెస్టుల్లో అలాంటి ఆట కుదరదు. రోజంతా బ్యాటింగ్ కొనసాగించే ఉద్దేశంతో ఆడాలి. అదే జరిగితే తన సహజశైలి షాట్లు ఆడే చాన్స్ ఉంటుంది. అటు తను భారీ స్కోరు సాధించడమే కాకుండా జట్టు కూడా తొలి రోజే 300+ స్కోరు అందుకోవచ్చు’ అని సన్నీ వివరించాడు.
Updated Date - Dec 26 , 2023 | 06:42 AM