ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PKL Titans : టైటాన్స్‌ మళ్లీ..

ABN, First Publish Date - 2023-12-07T04:21:19+05:30

ప్రొ. కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 50-28తో టైటాన్స్‌ను చిత్తు చేసింది. లీగ్‌ ప్రారంభ పోరు

వరుసగా రెండో ఓటమి

ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా గెలుపు

అహ్మదాబాద్‌ : ప్రొ. కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 50-28తో టైటాన్స్‌ను చిత్తు చేసింది. లీగ్‌ ప్రారంభ పోరులో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో టైటాన్స్‌ ఓడిన సంగతి తెలిసిందే. మరోవైపు పట్నా పైరేట్స్‌కిది తొలి మ్యాచ్‌. పైరేట్స్‌ జట్టులో రైడర్‌ సచిన్‌ 14 పాయింట్లతో చెలరేగగా..మరో రైడర్‌ రంజిత్‌ (8), ఆల్‌రౌండర్‌ అంకిత్‌ (5) సత్తా చాటారు. టైటాన్స్‌లో కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ (11) రాణించగా, సందీప్‌ (4) పర్లేదనిపించాడు. ప్రథమార్థం ఆరంభంలో టైటాన్స్‌ గట్టి పోటీ ఇవ్వడంతో మ్యాచ్‌ నువ్వా..నేనా అనేలా సాగింది. కానీ ఆపై తేలిపోయిన తెలుగు జట్టు ఆలౌటైంది. ఇదే అదనుగా విజృంభించిన పట్నా విరామానికి 28-16తో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. ద్వితీయార్థంలోనూ అదే జోరుతో మ్యాచ్‌ను పైరేట్స్‌ సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 57-27తో హరియాణా స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది.

Updated Date - 2023-12-07T04:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising