ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Para Archer Sheetal Devi : శీతల్‌.. ప్రపంచ నెం.1

ABN, First Publish Date - 2023-11-29T05:28:25+05:30

అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత యువ పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి మరో ఘనతను సాధించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల శీతల్‌.. ప్రపంచ

పారా ఆర్చర్‌ అరుదైన ఘనత

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత యువ పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి మరో ఘనతను సాధించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల శీతల్‌.. ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్‌ విభాగంలో శీతల్‌ రెండు స్థానాలు మెరుగుపరచుకొని టాప్‌ ర్యాంకర్‌గా అవతరించింది. రెండు చేతులు లేకున్నా కాళ్లతోనే బాణాలను సంధిస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తున్న శీతల్‌.. ఈ ఏడాది పారా ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, ఓ రజతంతో 3 పతకాలు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. మరో ఆర్చర్‌ సరిత ఆరో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. పురుషుల కాంపౌండ్‌లో రాకేశ్‌ మూడో ర్యాంకర్‌గా నిలిచాడు.

Updated Date - 2023-11-29T05:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising