ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆసీ్‌సతో టీ20 సిరీ్‌సకూ పాండ్యా దూరం!

ABN, First Publish Date - 2023-11-10T02:30:39+05:30

చీలమండ గాయంతో వరల్డ్‌కప్‌ నుంచి అవుటైన భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఈ నెల 23 నుంచి...

సూర్య లేదా రుతురాజ్‌కు కెప్టెన్సీ

న్యూఢిల్లీ: చీలమండ గాయంతో వరల్డ్‌కప్‌ నుంచి అవుటైన భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సకు టీ20 కెప్టెన్‌ అయిన పాండ్యా అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. మెగా కప్‌ సెమీస్‌ మ్యాచ్‌ తర్వాత ఆసీ్‌సతో జరిగే టీ20 సిరీ్‌సకు టీమిండియా ఎంపిక జరగనుంది. పాండ్యా గైర్హాజరీలో వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ లేదా ఆసియాడ్‌లో జట్టును నడిపించిన రుతురాజ్‌ గైక్వాడ్‌లో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించే చాన్సులున్నాయి. ప్రపంచక్‌పలో ఆడుతున్న సూర్య విశ్రాంతి కావాలని అడిగితే.. రుతురాజ్‌కు నాయకత్వం దక్కవచ్చు. వచ్చే ఏడాది అమెరికాలో జరిగే టీ20 వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకొని అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌, ముకేష్‌ కుమార్‌లతోపాటు తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, చాహల్‌లకు టీమ్‌లో చోటు లభించవచ్చు. అక్షర్‌ పటేల్‌ గాయం నుంచి కోలుకొంటే.. జడేజాకు విశ్రాంతినిచ్చి అతడిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అదరగొట్టిన అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌లతోపాటు వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ పేర్లు కూడా పరిశీలనకు రావచ్చు. కాగా, వచ్చే నెల 10 నుంచి డర్బన్‌లో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు హార్దిక్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉందని బోర్డు వర్గాల సమాచారం.

Updated Date - 2023-11-10T02:30:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising