ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐపీఎల్‌కు పాండ్యా దూరం?

ABN, Publish Date - Dec 24 , 2023 | 03:24 AM

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమవుతాడన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. చీలమండ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని...

న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమవుతాడన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. చీలమండ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని సమాచారం. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా టూర్‌కు కూడా దూరమయ్యాడు. అయితే, జనవరిలో అప్ఘానిస్థాన్‌తో జరిగే పొట్టి సిరీస్‌కైనా కోలుకొంటాడని ఆశించినా. అదీ కష్టమేనట. అదే జరిగే ఐపీఎల్‌లో కూడా ఆడే అవకాశాలు లేవని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌ కోసం హార్దిక్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని బీసీసీఐ కోరుకొంటోంది. ఈ నేపథ్యంలో అతడి విషయంలో రిస్క్‌ తీసుకోవడానికి బోర్డు సిద్ధం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ పాండ్యాను ట్రేడింగ్‌లో ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Updated Date - Dec 24 , 2023 | 03:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising