మార్ష్.. మోత
ABN, First Publish Date - 2023-11-12T04:56:17+05:30
సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ (132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 177 నాటౌట్) అజేయ భారీ శతకంతో...
132 బంతుల్లో 177 నాటౌట్
బంగ్లాపై ఆసీస్ ఘనవిజయం
కోల్‌కతా: సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ (132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 177 నాటౌట్) అజేయ భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. దీంతో 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఆసీస్ పట్టికలో 14 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లు ఆసీస్ బౌలర్లను దీటుగానే ఎదుర్కొన్నారు. తౌహిద్ హ్రిదయ్ (74) అర్ధసెంచరీతో రాణించగా.. బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు తన్‌జీద్ (36), లిట్టన్ (36) తొలి వికెట్‌కు 76 పరుగులు అందించగా.. షంటో (45)తో కలిసి మూడో వికెట్‌కు హ్రిదయ్ 64 రన్స్ జోడించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు ఉండడం గమనార్హం. భారీ ఛేదనలో ఆసీస్ ఎలాంటి తడబాటు లేకుండా చెలరేగి 44.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 307 పరుగులు చేసి గెలిచింది. హెడ్ (10) విఫలమైనా వార్నర్ (53)తో కలిసి రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించిన మార్ష్.. మూడో వికెట్‌కు స్మిత్ (63 నాటౌట్)తో కలిసి అజేయంగా 175 పరుగులు అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 50 ఓవర్లలో 306/8 (హ్రిదయ్ 74, షంటో 45, తన్‌జీద్ 36, లిట్టన్ 36, మహ్మదుల్లా 32, మెహ్దీ హసన్ 29; జంపా 2/32, ఎబాట్ 2/61).
ఆస్ట్రేలియా: 44.4 ఓవర్లలో 307/2 (మార్ష్ 177 నాటౌట్, స్మిత్ 63 నాటౌట్, వార్నర్ 53; టస్కిన్ 1/61, ముస్తాఫిజుర్ 1/71).
Updated Date - 2023-11-12T04:56:18+05:30 IST