Jr. Hockey World Cup : జర్మనీ..ఏడోసారి
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:57 AM
పురుషుల జూనియర్ హాకీ వరల్డ్‌క్‌పను జర్మనీ ఏడోసారి నెగ్గి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ 2-1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. జర్మనీలో కోర్డ్, హోల్డర్‌మన్ చెరో గోల్
జూ.హాకీ వరల్డ్‌కప్ సొంతం
ఫైనల్లో ఫ్రాన్స్‌పై విజయం
కౌలాలంపూర్: పురుషుల జూనియర్ హాకీ వరల్డ్‌క్‌పను జర్మనీ ఏడోసారి నెగ్గి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ 2-1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. జర్మనీలో కోర్డ్, హోల్డర్‌మన్ చెరో గోల్ కొట్టగా.. ఫ్రాన్స్ తరఫున వెరియర్ జూల్స్ (17వ) గోల్ సాధించాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన పురుషుల సీనియర్ హాకీ వరల్డ్‌క్‌పను కూడా జర్మనీనే గెలవడం విశేషం.
Updated Date - Dec 18 , 2023 | 03:57 AM