ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs South Africa: అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆకట్టుకున్న సాయి సుదర్శన్.. మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం

ABN, Publish Date - Dec 17 , 2023 | 06:02 PM

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొదటి వన్డేలో ఘన విజయం సాధించింది. ఆతిథ్య సౌతాఫ్రికా నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలతో రాణించడంతో 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది.

జోహనెస్‌బర్గ్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొదటి వన్డేలో ఘన విజయం సాధించింది. ఆతిథ్య సౌతాఫ్రికా నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలతో రాణించడంతో 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. లక్ష్య చేధనలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలోనే గెలిచింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్వల్ప స్కోరుకే వెనుదిరినప్పటికీ సాయి సుదర్శన్ - అయ్యర్ జోడి కీలకమైన 88 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దక్షిణాఫ్రికాలో బౌలర్లలో ఆండిలే ఫెహ్లుక్వాయో, ముల్డర్ చెరో వికెట్ మాత్రమే తీయగలిగారు. భారత బ్యాటింగ్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (52), తిలక్ వర్మ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. కాగా అరంగేట్రం మ్యాచ్‌లోనే సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా కడవరకు క్రీజులో ఉన్నాడు. 43 బంతుల్లోనే 55 పరుగులు సాధించారు. ఇందులో 9 ఫోర్లు ఉండడం గమనార్హం.


ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు వణికించారు. కేవలం 116 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత పేసర్లు అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ చెలరేగడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తేలిపోయారు. వరుస విరామాల్లో వికెట్లను చేజార్చుకున్నారు. అర్షదీప్ సింగ్ 5 వికెట్లు, అవేశ్ ఖాన్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశారు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో 33 పరుగులు చేసిన ఆండిలే ఫెహ్లుక్వాయో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత టోనీ డి జోర్జి(28), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఓపెనర్ రీజా హెండ్రింగ్స్ (0), వాండర్ డసెన్ (0), హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), వియాన్ ముల్డర్ (0), కేశవ్ మహారాజ్ (4), నాండ్రే బర్గర్ (7), తబ్రీజ్ షంషీ(11 నాటౌట్) చొప్పున ఘోరంగా విఫలమయ్యారు. మొత్తం భారత బౌలర్ల ధాటికి 27.3 ఓటర్లలోనే దక్షిణాఫ్రికా ఆలౌట్ అవడం గమనార్హం.

Updated Date - Dec 17 , 2023 | 06:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising