‘హజారే’ విజేత హరియాణా
ABN, Publish Date - Dec 17 , 2023 | 05:40 AM
విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో హరియాణా జట్టు విజేతగా నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఆ జట్టు 30 పరుగులతో రాజస్థాన్‌ను ఓడించింది.
రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో హరియాణా జట్టు విజేతగా నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఆ జట్టు 30 పరుగులతో రాజస్థాన్‌ను ఓడించింది. తొలుత హరియాణా 50 ఓవర్లలో 287/8 స్కోరు చేసింది. అంకిత్ (88), కెప్టెన్ అశోక్ మెనారియా (70) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనికేత్ చౌదరి 4, అరాఫత్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో రాజస్థాన్ 48 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో అభిజీత్ (106), కునాల్ సింగ్ (79) పోరాటం వృథా అయింది. సుమిత్, హర్షల్ పటేల్ చెరో 3, అన్షుల్, రాహుల్ తెవాటియా తలా రెండు వికెట్లు తీశారు.
Updated Date - Dec 17 , 2023 | 05:40 AM