ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: గుజరాత్ విధ్వంసం.. ముంబై ముందు కొండంత లక్ష్యం

ABN, First Publish Date - 2023-05-26T22:01:03+05:30

గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాట్స్‌మెన్స్ విధ్వంసం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: ఐపీఎల్-16 (IPL 2023)లో భాగంగా క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాట్స్‌మెన్స్ విధ్వంసం సృష్టించారు. సెంచరీతో శుభమాన్ గిల్ కదం తొక్కారు. బ్యాటింగ్ ఆరంభం నుంచి గుజరాత్ బ్యాట్స్‌మెన్స్ పరుగుల వరద పారించారు. గుజరాత్ బ్యాట్స్‌మెన్స్ మైదానం నలువైపుల బంతిని పరిగెత్తిస్తూ ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు చుక్కలు చూపించారు. 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ ముందు కొండంత విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. ముంబై ఇండియన్స్ జట్టు ఈ భారీ విజయాన్ని చేరుకోవాలంటే 234 పరుగులు సాధించాల్సిందే.

గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్స్ పరుగుల వరద పారించారు. బ్యాట్స్‌మెన్స్ సాధించిన స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి. శుభమాన్ గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశారు. వృద్ధిమాన్ సాహా 16 బంతుల్లో 18 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 31 బంతుల్లో 43 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. రషీద్ ఖాన్ 2 బంతుల్లో 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

54 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోగా, 18 పరుగులు చేసి 6.2 ఓవర్‌లో వృద్ధిమాన్ సాహా ఔటయ్యాడు. 192 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. శుభమాన్ గిల్ 129 పరుగులు చేసి 16.5 ఓవర్‌లో వెనుదిరిగారు. 214 పరుగుల వద్ద గుజరాత్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 31 బంతుల్లో 43 పరుగులు చేసి 19 ఓవర్‌లో ఔటయ్యారు.

తొలుత ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటింగ్‌ బరిలోకి దిగింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సిటీలో నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

Updated Date - 2023-05-26T23:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising