అంతర్జాతీయ క్రికెట్‌కు లానింగ్ గుడ్‌బై
ABN, First Publish Date - 2023-11-10T02:32:43+05:30
ఆస్ట్రేలియాను మహిళల క్రికెట్‌లో తిరుగులేని జట్టుగా నిలిపిన కెప్టెన్ మెగ్ లానింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం వీడ్కోలు పలికింది. 13 ఏళ్ల కెరీర్‌లో ఆస్ట్రేలియాకు ఆమె...
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాను మహిళల క్రికెట్‌లో తిరుగులేని జట్టుగా నిలిపిన కెప్టెన్ మెగ్ లానింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం వీడ్కోలు పలికింది. 13 ఏళ్ల కెరీర్‌లో ఆస్ట్రేలియాకు ఆమె ఎన్నో అపురూప విజయాలు అందించింది. ఇందులో కెప్టెన్‌గా అందించిన ఐదు ట్రోఫీలు సహా మొత్తం ఏడు వరల్డ్ కప్ టైటిళ్లు ఉండడం విశేషం. 31 ఏళ్ల మెగ్ లానింగ్ నాయకత్వంలో గత ఏడాది ఆసీస్ జట్టు కామన్వెల్త్ క్రీడల పసిడి పతకమూ కైవసం చేసుకుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి 241 ఇన్నింగ్స్ (ఆరు టెస్ట్‌లు, 103 వన్డేలు, 132 టీ20)లో 8352 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన ఆసీస్ మహిళా క్రికెటర్లలో లానింగ్ అగ్రగామిగా ఉంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లలో ఆడతానని ఆమె వెల్లడించింది. క్రికెట్‌కు మెగ్ లానింగ్ సేవలు వెలకట్టలేనివని..క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే ప్రశంసించారు.
Updated Date - 2023-11-10T02:32:45+05:30 IST