మాన్సీ జోడీకి స్వర్ణం
ABN, Publish Date - Dec 19 , 2023 | 01:16 AM
దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌లో మాన్సీ జోషి జంట స్వర్ణం గెలిచింది. మహిళల డబుల్స్ ఎస్‌ఎల్3-ఎ్‌సయు5 విభాగం ఫైనల్లో మాన్సీ-తులసీమతి మురుగేశన్ జోడీ...
దుబాయ్ పారా బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ: దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌లో మాన్సీ జోషి జంట స్వర్ణం గెలిచింది. మహిళల డబుల్స్ ఎస్‌ఎల్3-ఎ్‌సయు5 విభాగం ఫైనల్లో మాన్సీ-తులసీమతి మురుగేశన్ జోడీ 15-21, 21-14, 21-6తో ఇండోనేసియాకు చెందిన లియాని ఓక్టిలా-ఖలిమటుస్ సదియాపై విజయం సాధించింది. పురుషుల ఎస్‌ఎల్3 ఫైనల్లో భగత్ 17-21, 18-21తో డేనియల్ బెతెల్ (ఇంగ్లండ్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకొన్నాడు. ఎస్‌ఎల్4 కేటగిరీలో టోక్యో పతక విజేత సుహాస్ యతిరాజ్ రజతం దక్కించుకోగా.. సుఖాంత్ కదమ్, తరుణ్‌లకు కాంస్యాలు లభించాయి. మిక్స్‌డ్‌లో భగత్-మనీషా రాందాస్ జంట రజతం, నితీ్‌ష-తులసీమతి ద్వయం కాంస్యం సాధించాయి. మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్4 విభాగంలో పలక్ కోహ్లీ కాంస్యం సొంతం చేసుకొంది.
Updated Date - Dec 19 , 2023 | 01:16 AM