ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సిరీస్‌ పట్టేస్తారా?

ABN, First Publish Date - 2023-12-01T02:35:04+05:30

యువ బ్యాటర్లు మోత మోగిస్తుండడంతో పరుగుల వరద పారిస్తున్న భారత్‌.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీ్‌సను పట్టేయాలన్న పట్టుదలతో ఉంది...

జోరు మీదున్న భారత్‌

  • జట్టులోకి శ్రేయాస్‌, దీపక్‌ చాహర్‌

  • తిలక్‌వర్మ, ప్రసిద్ధ్‌కు చోటు కష్టమే!

  • స్వదేశానికి మ్యాక్సీ, స్మిత్‌, ఇన్‌గ్లి్‌స

  • ఆసీస్‌తో నాలుగో టీ20 నేడు

రాయ్‌పూర్‌: యువ బ్యాటర్లు మోత మోగిస్తుండడంతో పరుగుల వరద పారిస్తున్న భారత్‌.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీ్‌సను పట్టేయాలన్న పట్టుదలతో ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టీ20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే, అంతగా అనుభవం లేని ద్వితీయ శ్రేణి బౌలింగ్‌ విభాగం ఈ సిరీ్‌సలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. మూడో టీ20లో మ్యాక్స్‌వెల్‌ ఊచకోతతో చివరి రెండు ఓవర్లలో 40పైగా పరుగులను కాపాడుకోలేక పోయింది. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో భారత బౌలింగ్‌ మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చు. మిడిలార్డర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ రీఎంట్రీ ఇవ్వనుండడంతో తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసిన ప్రసిద్ధ్‌ కృష్ణకు బదులు దీపక్‌ చాహర్‌ తుది జట్టులోకి రావచ్చు. కొత్త పెళ్లికొడుకు ముకేష్‌ కుమార్‌ మళ్లీ అందుబాటులోకి రావడంతో టీమిండియా బౌలింగ్‌ కొంత పదునెక్కనుంది. ఇక మ్యాక్స్‌వెల్‌తోపాటు వరల్డ్‌క్‌పలో ఆడిన మరికొందరు స్వదేశానికి తిరిగి వెళ్లడం భారత్‌కు ఊరట కలిగించే విషయం. మరోవైపు మూడో టీ20లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ ఆశలను సజీవంగా నిలబెట్టుకోవాలనుకొంటోంది. స్మిత్‌, మ్యాక్సీ, జంపా, స్టొయినిస్‌, ఇన్‌గ్లి్‌సను వెనక్కి పిలవడంతో జట్టులో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి. హిట్టర్‌ బెన్‌ మెక్‌ డెర్మాట్‌తోపాటు క్రిస్‌ గ్రీన్‌, బెన్‌ డ్వార్షుయి్‌సకు తుది జట్టులో చోటుదక్కే అవకాశం ఉంది. హెడ్‌, టిమ్‌ డేవిడ్‌, కెప్టెన్‌ వేడ్‌పై టీమ్‌ ఎక్కువగా బ్యాటింగ్‌ ఆధారపడింది. బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్‌ మినహా మిగతా వారు అంతగా ఆకట్టుకోలేక పోతున్నారు.

జట్లు (అంచనా)

భారత్‌: యశస్వీ జైస్వాల్‌, రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కె ప్టెన్‌), శ్రేయాస్‌ అయ్యర్‌/తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌/అవేశ్‌ఖాన్‌, దీపక్‌ చాహర్‌/ప్రసిద్ధ్‌, ముకేష్‌.

ఆస్ట్రేలియా: ఆరోన్‌ హార్డీ, హెడ్‌, షార్ట్‌, బెన్‌ మెక్‌ డెర్మా ట్‌, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), క్రిస్‌ గ్రీన్‌, బెన్‌ డ్వార్షుయిస్‌, ఎల్లీస్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, తన్వీర్‌.

పిచ్‌: ఈ ఏడాది ఆరంభంలో ఈ వికెట్‌పై జరిగిన వన్డేలో కివీస్‌ను భారత్‌ 108 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఆసియాలోనే అతిపెద్ద బౌం డ్రీలు ఉన్న వాటిల్లో షహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడి యం ఒకటి. కానీ ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని సమాచారం.

రాత్రి 7 గం. నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో..

Updated Date - 2023-12-01T02:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising