ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోహిత్‌కు ముందే తెలుసా?

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:41 AM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ) కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌ పాండ్యాకు అప్పగించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. రోహిత్‌ సారథ్యంలో ముంబై ఐదుసార్లు విజేతగా నిలిచింది.

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ) కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌ పాండ్యాకు అప్పగించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. రోహిత్‌ సారథ్యంలో ముంబై ఐదుసార్లు విజేతగా నిలిచింది. దీంతోపాటు అభిమానగణం కూడా భారీగా పెరిగింది. అయితే, హఠాత్తుగా శర్మను తొలగించి పాండ్యాను కెప్టెన్‌గా నియమించామనే ఫ్రాంచైజీ ప్రకటనపై ముంబై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, వన్డే వరల్డ్‌కప్‌కు ముందే సారథ్యాన్ని మార్చుతున్నట్టు రోహిత్‌కు ముంబై యాజమాన్యం సమాచారం అందించినట్టు తెలుస్తోంది. నాయక్వత మార్పునకు సమ్మతి తెలిపిన అతడు.. పాండ్యా కెప్టెన్సీలో ఆడేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. తాజాగా హిట్‌మ్యాన్‌ చేసిన సేవలకు కృతజ్ఞతలు చెబుతూ ముంబై ట్వీట్‌ చేసింది. ‘‘రో.. 2013లో నువ్వు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించావు. అప్పుడు మేనేజ్‌మెంట్‌ను ఒక్కటే అడిగావు. ‘మా మీద నమ్మకం ఉంచండి. గెలుపైనా.. ఓటమైనా నవ్వుతూనే ఉండాలి’ అని చెప్పావు. పదేళ్ల కెప్టెన్సీలో ఆరు ట్రోఫీలు (చాంపియన్స్‌ లీగ్‌తో కలిపి) అందించావు. నీ గొప్ప ప్రయాణం సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది. ధన్యవాదాలు కెప్టెన్‌ రోహిత్‌’’ అని ముంబై ట్వీట్‌ చేసింది. కానీ, హిట్‌మ్యాన్‌ను తప్పించడంపై ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు ముంబై జట్టు జెర్సీలను తగులబెడుతున్న వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో కూడా ముంబై ఫాలోయర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఎక్స్‌లో ఎంఐ టీమ్‌కు 86 లక్షలుగా ఉన్న ఫాలోయర్లు.. 82 లక్షలకు తగ్గిపోయారు. ఇన్‌స్టాలో కూడా 5 లక్షల మంది ముంబైని అన్‌ఫాలో చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 05:42 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising