ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prabhsimran Singh: అతడు మ్యాచ్ విన్నర్ అవుతాడు: పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్

ABN, First Publish Date - 2023-04-14T20:52:39+05:30

పంజాబ్ యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) మ్యాచ్ విన్నర్ అవుతాడని ఆ జట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మొహాలీ: పంజాబ్ యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) మ్యాచ్ విన్నర్ అవుతాడని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హడిన్(Brad Haddin) చెప్పుకొచ్చాడు. తీవ్ర ఒత్తిడిలోనూ బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్రభ్‌సిమ్రన్ ఒకసారి క్రీజులో నిలదొక్కుకుంటే చాలా ప్రమాదకరమైన ఆటగాడిగా మారిపోతాడు. 22 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లోనే 60 పరుగులు బాదాడు. అయితే, ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ డకౌట్లు అయి నిరాశ పరిచాడు. అయినప్పటికీ హడిన్ అతడికి అండగా నిలిచాడు. జట్టులో అతడి స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని తేల్చి చెప్పాడు.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడేంటో చూశామని, ఒకసారి అతడు క్రీజులో కుదురకుంటే ఆపడం కష్టమని హడిన్ పేర్కొన్నాడు. మైదానమంతా షాట్లతో విరుచుకుపడే ప్రభు.. మ్యాచ్ విన్నర్ అవుతాడని జోస్యం చెప్పాడు. ప్రభ్‌సిమ్రన్ కనుక అదే పనిగా నిరాశ పరుస్తుంటే టాపార్డర్‌లో జట్టుకున్న ఉన్న అవకాశాలపై అడిగిన ప్రశ్నకు హడిన్ బదులిస్తూ.. చాలా అవకాశాలే ఉన్నాయని, కాకపోతే ప్రస్తుతానికి ప్రభు స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని తేల్చి చెప్పాడు. తొలి ఆరు ఓవర్లలో తమకు అవసరమైన తరహా ఆటను ఆడేందుకు అతడికి మద్దతిస్తామని హడిన్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-04-14T20:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising