ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MIW vs UPW: ముంబైని నిలువరించిన వారియర్స్ స్పిన్నర్లు.. ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పదా?

ABN, First Publish Date - 2023-03-18T17:23:17+05:30

వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు తొలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నవీ ముంబై: వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు తొలి ఓటమి తప్పేలా లేదు. యూపీ వార్సియర్స్‌(UP Warriorz)తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లు క్రమశిక్షణగా బంతులు విసరడంతో పరుగులు తీసేందుకు కష్టపడిన ముంబై బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. ముఖ్యంగా సోఫీ ఎక్లెస్టోన్(Sophie Ecclestone) బౌలింగులో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చిన సోఫీ మూడు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

ముంబై బ్యాటర్లలో ఓపెనర్ హేలీ మాథ్యూస్ చేసిన 35 పరుగులే అత్యధికం. 30 బంతులు ఆడిన హేలీ ఒక ఫోర్, 3 సిక్సర్లతో 35 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 25 పరుగులు చేసింది. ఇసీ వోంగ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 32 పరుగులు చేసి రనౌట్ అయింది. జట్టులో 8 మంది సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు.

ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచుల్లోనూ విజయం సాధించి జోరుమీదున్న ముంబై ఈ స్వల్ప లక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటుందో చూడాల్సిందే. ఈ మ్యాచ్‌లో కనుక ముంబై ఓడితే, ఆ జట్టును ఓడించిన తొలి జట్టుగా యూపీ రికార్డులకెక్కుతుంది.

Updated Date - 2023-03-18T17:33:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising