IPL 2023 Schedule: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. తొలి పోరు వీరి మధ్యే!
ABN, First Publish Date - 2023-02-17T18:39:06+05:30
ఐపీఎల్(IPL) పండుగకు రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా,
న్యూఢిల్లీ: ఐపీఎల్(IPL) పండుగకు రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తున్న ‘పొట్టిపండుగ’ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. తొలి మ్యాచ్ మార్చి 31న జరుగుతుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)-నాలుగుసార్లు ఐపీఎల్ విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఈ మ్యాచ్‌లో తలపడతాయి. అహ్మదాబాద్ ఇందుకు వేదిక అవుతుంది. చివరి లీగ్ మ్యాచ్ మే 21న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB-గుజరాత్ టైటాన్స్(GT) మధ్య బెంగళూరులో జరుగుతుంది.
లీగ్ దశలో మొత్తం పది జట్లు ఏడు మ్యాచ్‌లను సొంత మైదానంలో ఆడితే, మిగతా ఏడింటిని బయట ఆడతాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరగనుండగా ఇందులో 18 డబుల్ హెడర్‌లు ఉంటాయి. లీగ్ మ్యాచ్‌లు మొత్తం 52 రోజులపాటు 12 వేదికల్లో జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. ఫ్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్, వేదికలను తర్వాత ప్రకటిస్తారు.
మ్యాచ్‌లు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1న తొలి డబుల్ హెడర్ జరుగుతుంది. తొలి మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings)-కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) మధ్య మొహాలిలో జరుగుతుంది. రెండో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ కేపిటల్స్(DC) మధ్య లక్నోలో జరుగుతుంది.
ఏప్రిల్ 2న బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరుగుతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) మధ్య మ్యాచ్ జరుగుతుంది. తొలి మూడు రోజుల్లోనే 10 జట్లు తొలి మ్యాచ్‌లు ఆడేస్తాయి.
రాజస్థాన్ రాయల్స్ జైపూర్‌లో హోం గేమ్స్ ఆడడానికి ముందు తొలి రెండు మ్యాచ్‌లను గువాహటిలో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ మొహాలిలో ఐదు హోంగేమ్స్ ఆడుతుంది. ఆ తర్వాత మిగిలి రెండు హోంగేమ్స్‌ను ధర్మశాలలో ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌తో ఆడుతుంది.
Updated Date - 2023-02-17T18:39:08+05:30 IST