ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IND vs NZ: దుమ్మురేపుతున్న టీమిండియా ఓపెనర్లు.. పది ఓవర్లకు అంత స్కోర్ చేశారంటే..

ABN, First Publish Date - 2023-01-24T14:28:11+05:30

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో (IND vs NZ) టీమిండియా ఓపెనర్లు దుమ్ములేపుతున్నారు. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి ఆడుతున్నారు. 10 ఓవర్లకే 82 పరుగులు చేశారు. టీమిండియా ఓపెనర్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో (IND vs NZ) టీమిండియా ఓపెనర్లు దుమ్ములేపుతున్నారు. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి ఆడుతున్నారు. 10 ఓవర్లకే 82 పరుగులు చేశారు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma) 39 పరుగులు, గిల్ (Shubman Gill) 41 పరుగులతో అదరగొడుతున్నారు. టీమిండియాకు ఈ ఇద్దరూ చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరి దూకుడు చూస్తుంటే టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ దక్కించుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.

టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి వన్డేలో గట్టి పోటీనిచ్చిన కివీస్‌.. రెండో మ్యాచ్‌లో పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకుంది. ఇండోర్‌ పిచ్‌ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన టీ20లో రోసో 48 బంతుల్లోనే శతకం బాదేశాడు. అందుకే నేటి మ్యాచ్‌లో భారీ స్కోర్లను ఆశించవచ్చు.

అటు కివీస్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడినా.. ఈ ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి టీ20 సిరీస్‌ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించాలనుకుంటోంది. పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత పర్యటనకు వచ్చే ఏ జట్టయినా నిరాశతో వెనుదిరగాల్సిందే. ఎందుకంటే ఇక్కడ జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకోవడం టీమిండియాకు మంచినీళ్ల ప్రాయంలా మారింది. 2009 నుంచి సొంత గడ్డపై 27 సిరీస్‌లు ఆడితే 24 నెగ్గడం విశేషం. అంతేనా.. 2019 నుంచి ఇక్కడ వరుసగా ఏడు సిరీస్‌లను వశం చేసుకోగలిగింది. ఇక నేటి మూడో వన్డేలోనూ ప్రత్యర్థికి ఓటమి రుచి చూపిస్తే ఈ ఏడాదే వరుసగా రెండో క్లీన్‌స్వీప్‌ చేసినట్టవుతుంది.

Updated Date - 2023-01-24T14:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising