ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్ మీరు చూసి ఉండరు.. ఇంతకీ ఔటా? నాటౌటా?.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ!

ABN, First Publish Date - 2023-01-02T18:43:20+05:30

క్రికెట్‌లో కొన్నిసార్లు నమ్మశక్యం కాని అద్భుతాలు జరుగుతాయి. అలాంటి వాటిలో కొన్ని వివాదంగా మారుతాయి. ప్రపంచమంతా

catch out
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: క్రికెట్‌లో కొన్నిసార్లు నమ్మశక్యం కాని అద్భుతాలు జరుగుతాయి. అలాంటి వాటిలో కొన్ని వివాదంగా మారుతాయి. ప్రపంచమంతా దాని గురించే మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత అభిమానులు దాని గురించి మర్చిపోతారు. అయితే, కొన్ని ఘటనలు మాత్రం క్రికెట్‌లో నిబంధనలకు నాంది పలుకుతాయి. గతంలో అలాంటి ఘటనలు చాలానే జరిగాయి.

ఇప్పుడిలానే మరో ఘటన జరిగింది. ఇప్పుడు కూడా క్రికెట్ ప్రపంచమంతా దాని గురించి మాట్లాడుకుంటోంది. ప్రపంచంలోని అతిపెద్ద టీ20 టోర్నీ అయిన బిగ్‌బాష్‌ లీగ్‌(Big Bash League)లో క్రికెట్ ప్రపంచం ఎల్లకాలం గుర్తుంచుకునే ఘటనలు ఈ సీజన్‌లో జరుగుతున్నాయి. డిసెంబరు 16న అడిలైడ్ స్ట్రైకర్స్‌(Adelaide Strikers)తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్(Sydney Thunder) జట్టు 5.5 ఓవర్లలో 15 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 క్రికెట్‌లో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. క్రికెట్ అభిమానులు ఇప్పటి వరకు దీని గురించే చర్చించుకుంటుండగా, తాజాగా మర్చిపోలేని మరో ఘటన జరిగింది.

సిడ్నీ సిక్సర్స్(Sydney Sixers)-బ్రిస్బేన్ హీట్(Brisbane Heat ) మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన సంచలనం కావడం మాత్రమే కాదు.. వివాదాస్పదం కూడా అయింది. సిడ్నీ సిక్సర్స్ జట్టు బ్యాటింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్క్ స్టెకెటీ(Mark Steketee) వేసిన బంతిని బ్యాటర్ జోర్డాన్ సిల్క్( Jordan Silk) లాంగ్ ఆఫ్ వైపుగా బలంగా బాదాడు. అది స్టాండ్స్ వైపుగా దూసుకెళ్లింది. అప్పుడే అద్భుతం జరిగింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మైఖేల్ నేసర్ (Michael Neser) మ్యాజిక్ చేశాడు. స్టాండ్స్ వైపుగా దూసుకెళ్తున్న బంతిని అడ్డుకునే ప్రయత్నంలో గాల్లోకి ఎగిరి బంతిని మైదానంలోకి పంపే ప్రయత్నం చేస్తూ క్రీజు దాటాడు. అయితే, బంతి మళ్లీ బౌండరీ లైన్‌కు ఆవల పడుతుందని గ్రహించిన మైఖేల్ బౌండరీ లైన్ బయటే గాల్లోకి ఎగిరి బంతిని మైదానంలోకి పంపాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చి దానిని పట్టుకున్నాడు.

బౌండరీ లైన్ బయటి నుంచి బంతిని ఫీల్డర్ మైదానంలోకి పంపాడు కాబట్టి అది తప్పకుండా సిక్సరేనని క్రికెట్ అభిమానులు భావించారు. అయితే, అనూహ్యంగా అంపైర్ అవుట్ అంటూ వేలిని పైకెత్తాడు. ఇప్పుడిదే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బౌండరీ లైన్‌ దాటి బయటకు వెళ్లిన బంతిని మైదానంలోకి పంపి క్యాచ్ పడితే అది అవుట్ ఎలా అవుతుందన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే, రీప్లే పరిశీలించిన తర్వాతే దానిని అవుట్‌గా ప్రకటించినట్టు ఫీల్డ్ అంపైర్ తెలిపాడు. మైఖేల్ బౌండరీ బయటి నుంచి బంతిని మైదానంలోకి పంపే సమయంలో అతడి కాళ్లు గాల్లో ఉన్నాయని, కాబట్టి అది అవుటేనని చెప్పుకొచ్చాడు. ఆయన వివరణ అంత సంతృప్తిగా అనిపించకపోవడంతో క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడిది తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. నాథన్ మెక్ స్వీనీ 52 బంతుల్లో 84 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోస్ బ్రౌన్ 23 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అనంతరం 225 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది. జేమ్స్ విన్స్, జోర్డాన్ సిల్క్ చెరో 41 పరుగులు చేశారు.

Updated Date - 2023-01-02T18:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising