1st ODI : 282.. చాల్లేదు
ABN, Publish Date - Dec 29 , 2023 | 06:53 AM
జెమీమా రోడ్రిగ్స్ (77 బంతుల్లో 82), పూజా వస్త్రాకర్ (46 బంతుల్లో 62 నాటౌట్) అర్ధ శతకాలతో భారీ స్కోరు చేసినా.. భారత మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి
6 వికెట్లతో భారత్ ఓటమి
తొలి వన్డేలో ఆసీస్ విజయం
ముంబై: జెమీమా రోడ్రిగ్స్ (77 బంతుల్లో 82), పూజా వస్త్రాకర్ (46 బంతుల్లో 62 నాటౌట్) అర్ధ శతకాలతో భారీ స్కోరు చేసినా.. భారత మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడింది. మన అమ్మాయిలకు ఇది వరుసగా ఆరో ఓటమి. తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. వేర్హమ్, గార్డ్‌నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఫోబీ లిచ్‌ఫీల్డ్ (78), ఎలీస్ పెర్రీ (75) అదరగొట్టడంతో.. వన్డేల్లో రెండో అత్యధిక లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లిచ్‌ఫీల్డ్, పెర్రీ రెండో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. ఆపై బెత్ మూనీ (42), తహిల మెక్‌గ్రాత్ (68 నాటౌట్)లు నాలుగో వికెట్‌కు వేగంగా 88 పరుగులు జోడించడంతో ఆసీస్ గెలుపు దిశగా దూసుకెళ్లింది. మూనీని వస్త్రాకర్ బౌల్డ్ చేసినా.. మెక్‌గ్రాత్ మరో 21 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ ఆరంభంలో తడబడినా.. జెమీమా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకొంది. పూజతో కలసి 8వ వికెట్‌కు 68 రన్స్ భాగస్వామ్యంతో జట్టుకు భారీ స్కోరు అందించింది. వీరిద్దరి దెబ్బకు ఆసీస్ చివరి 5 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకొంది. యాస్తిక (49) రాణించింది.'
భారత్: యాస్తిక (సి) స్కట్ (బి) వేర్హమ్ 49, షఫాలీ (బి) బ్రౌన్ 1, రిచా (సి) మెక్‌గ్రాత్ (బి) సదర్లాండ్ 21, హర్మన్ (సి) బ్రౌన్ (బి) గార్డ్‌నర్ 9, జెమీమా (సి) మెక్‌గ్రాత్ (బి) గార్డ్‌నర్ 82, దీప్తి (సి) లిచ్‌ఫీల్డ్ (బి) కింగ్ 21, అమన్‌జోత్ (సి) కింగ్ (బి) వేర్హమ్ 20, రాణా (బి) స్కట్ 1, వస్త్రాకర్ (నాటౌట్) 62, రేణుక (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 282/8; వికెట్ల పతనం: 1-12, 2-41, 3-57, 4-95, 5-134, 6-179, 7-182, 8-250; బౌలింగ్: బ్రౌన్ 7-0-33-1, స్కట్ 9-0-47-1, సదర్లాండ్ 7-0-43-1, గార్డ్‌నర్ 10-1-63-2, వేర్హమ్ 9-0-55-2, మెక్‌గ్రాత్ 2-0-8-0, కింగ్ 6-0-32-1;
ఆస్ట్రేలియా: హీలీ (సి) రాణా (బి) రేణుక 0, లిచ్‌ఫీల్డ్ (బి) రాణా 78, పెర్రీ (సి) వస్త్రాకర్ (బి) దీప్తి 75, మూనీ (బి) వస్త్రాకర్ 42, మెక్‌గ్రాత్ (నాటౌట్) 68, గార్డ్‌నర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 46.3 ఓవర్లలో 285/4; వికెట్ల పతనం: 1-0, 2-148, 3-170, 4-258; బౌలింగ్: రేణుక 7-1-30-1, వస్త్రాకర్ 8-0-41-1, సైకా 6-0-48-0, అమన్‌జోత్ 3-0-17-0, రాణా 9.3-0-54-1, దీప్తి 10-0-55-1, హర్మన్ 3-0-32-0.
Updated Date - Dec 29 , 2023 | 06:53 AM