ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Knocked On Coffin: శవ పేటిక నుంచి శబ్దాలు.. ఓపెన్ చేసి అంతా షాక్..

ABN, First Publish Date - 2023-06-19T17:27:33+05:30

ఓ ముసలావిడ చనిపోయిందనుకొని అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. జరగాల్సిన కార్యక్రమాలన్ని చూసుకొని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఖననం చేసే ముందు శవపేటిక నుంచి ఓ శబ్దం వినిపించింది. ఓపెన్ చేసి చూసి అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. చనిపోయిందనుకున్న ఆ ముసలావిడ తిరిగి బతికొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ ముసలావిడ చనిపోయిందనుకొని అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. జరగాల్సిన కార్యక్రమాలన్ని చూసుకొని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఖననం చేసే ముందు శవపేటిక నుంచి ఓ శబ్దం వినిపించింది. ఓపెన్ చేసి చూసి అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. చనిపోయిందనుకున్న ఆ ముసలావిడ తిరిగి బతికొచ్చింది. ఆ ముసలావిడ ఎప్పుడు చనిపోయింది.. ఎలా బతికొచ్చింది.. తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలుసుకుందాం రండి..

బీబీసీ సమాచారం ప్రకారం.. ఈక్వెడార్‌కు చెందిన 76 ఏళ్ల బెల్లా మోంటోయా అనారోగ్యంతో ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె గుండె, శ్వాస ఆడకపోవడంతో డాక్టర్లు ఆమె చనిపోయిందని నిర్ధారించారు. బెల్లా మోంటోయా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. శవపేటికలో భద్రపరిచిన ఆమె మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లి ఖననం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో శవపేటిక నుంచి శబ్దాలు రావడంతో తెరిచి చూస్తే..బెల్లా మోంటోయా బతికే ఉంది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్యర్యపోయారు. షాక్ నుంచి తేరుకొని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు.

జూన్ 9న బెల్లా మోంటోయా చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. క్యాటలెప్సీ అనే వింత పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీని లక్షణాలు ఏంటంటే.. మూర్ఛ, శరీరం బిగుసుపోవడం, స్పృహ కోల్పోవడం. మహిళ కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌తో శ్వాస, గుండె పనిచేయలేదని.. చికిత్సకు స్పందించడలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆమె మృతిని ధృవీకరించారు.

మోంటోయాను చాలా గంటలు శవపేటికలో ఉంచడంతో కారణంగా.. శవపేటిక తెరిచినా అందులోనే పడుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు చూపించే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌‌గా మారింది. మోంటోయాను స్ట్రెచర్‌ ద్వారా అంబులెన్స్‌లోకి తరలించే ముందు పారామెడిక్స్ వచ్చి ఆమెను పరిశీలిస్తున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది.

ఏదీ ఏమైనప్పటికీ చనిపోయిందనుకున్న మనిషి తిరిగి రావడం కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగితేలారు.

Updated Date - 2023-06-19T17:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising