చేతులతో పట్టుకోకుండా..
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:37 AM
సామాజికసేవ చేయాలంటే మనమే దాతలు కావాల్సిన పని లేదు. దాతలను ఆలోచింపజేస్తే చాలు....
సామాజికసేవ చేయాలంటే మనమే దాతలు కావాల్సిన పని లేదు. దాతలను ఆలోచింపజేస్తే చాలు.. సహాయం అందుతుంది. కెనడాలోని ఆల్బర్టాకు చెందిన సైక్లిస్టు రాబర్ట్‌ముర్రేకు ఇదే ఆలోచన వచ్చింది. తన చిన్నప్పుడు నానమ్మ మతిమరుపువ్యాధి (అల్జీమర్స్)తో బాధ పడేది. ఎలాగైనా సరే అల్జీమర్స్ బాధితులకు సహాయపడాలనుకున్నాడు రాబర్ట్. ఏదోఒకటి చేస్తేకానీ దాతల్ని ఆకట్టుకోలేనని తెలిసి.. చేతులతో హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ తొక్కడానికి సిద్ధమయ్యాడు. ఏకంగా 130 కి.మీ. అలా సైకిల్ తొక్కి గిన్నిస్‌కు ఎక్కాడు. ‘‘నేను కేవలం అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ పని చేశాను. నా పని మీకు నచ్చితే సహాయం చేయండి. ఆ డబ్బును బాధితుల కోసం ఖర్చు చేద్దాం’’ అన్నాడాయన. దాంతో ఎంతోమంది దాతలు స్పందించారు. ఏదో ఒక సాహసం చేసి, ప్రజల దృష్టిని ఆకర్షించి, దాతలను సమీకరించడం విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన దగ్గరా ఇలా చేస్తే బావుంటుంది.
Updated Date - Dec 17 , 2023 | 11:44 AM