ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో వైఫైని రాత్రి పూట కూడా ఆన్‌లో ఉంచుతున్నారా?.. అది ఎంత అనర్థమో తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది!

ABN, First Publish Date - 2023-04-26T07:37:43+05:30

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నెట్(Internet) లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. అన్ని పనులు ఇంటర్నెట్ సహాయంతోనే జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నెట్(Internet) లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. అన్ని పనులు ఇంటర్నెట్ సహాయంతోనే జరుగుతున్నాయి. ప్రతీ ఇంటిలోనూ ఇంటర్నెట్ ఒక అవసరంగా మారిపోయింది. ఈ నేపధ్యంలో మెరుగైన కనెక్టివిటీ(Connectivity), వేగవంతమైన ఇంటర్నెట్ కోసం మనం ఇంట్లో WiFiని ఇన్‌స్టాల్ చేసుకుంటాం.

అయితే దానివలన మనల్ని చుట్టుముట్టే అనారోగ్య సమస్యలను(Health problems) గ్రహించలేకపోతున్నాం. వైఫై నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. వాస్తవానికి వైఫై రూటర్ నుండి అనేక రకాల రేడియేషన్ తరంగాలు(Radiation waves) వెలువడుతాయి. ఇది డిప్రెషన్, నిద్రలేమి అధిక రక్తపోటు మొదలైన వ్యాధులకు కారణంగా నిలుస్తుంది. Wi-Fi కి సంబంధించిన విద్యుదయస్కాంత తరంగాలు, ఇంటర్నెట్ అధిక వినియోగం మన నిద్రను అధికంగా ప్రభావితం చేస్తాయి.

దీని వల్ల నిద్రలేమి(Insomnia) సమస్య తలెత్తుతుంది. Wi-Fi నుంచి వెలువడే రేడియేషన్ తరంగాలు మనల్ని మానసికంగా ప్రభావితం చేస్తాయి. ఇంటర్నెట్‌ను ఎక్కువగా వినియోగించడం వల్ల జ్ఞాపకశక్తిపై(memory) ప్రభావం పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ సమస్య వస్తుంది.

ఇటువంటి చెడు ప్రభావాలను నివారించడానికి మనం ఇంటర్నెట్ వినియోగాన్ని పరిమితం చేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఇంటర్నెట్(Internet) వినియోగించాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు వైఫైని ఆఫ్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల రేడియేషన్ తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాల నుండి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా, విద్యుత్తును(Electricity) కూడా ఆదా చేయవచ్చు.

Updated Date - 2023-04-26T08:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising