బావులు చతురస్రం, త్రికోణంలో కాకుండా గుండ్రంగానే ఎందుకుంటాయి? వీటి వెనుక శాస్త్రీయ కారణం ఇదేనని తెలిస్తే...
ABN, First Publish Date - 2023-03-09T08:26:00+05:30
Why Wells Are Round In Shape: ప్రాచీన కాలం నుంచి ఈనాటి వరకు మన జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు జీవితం చాలా సులభతరం అయ్యింది. అయితే గతంలో చాలా పనులు చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది.
Why Wells Are Round In Shape: ప్రాచీన కాలం నుంచి ఈనాటి వరకు మన జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు జీవితం చాలా సులభతరం అయ్యింది. అయితే గతంలో చాలా పనులు చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. పూర్వం జనం నీటి కోసం నదులపైనే ఆధారపడేవారు. ఆ తర్వాత మనిషి తన తెలివితేటలతో బావులు(Wells) తవ్వి నీటిని తోడటం ప్రారంభించాడు. నేటికీ ఇటువంటి బావులు కనిపిస్తాయి.
బావులు గుండ్రంగా(Round) ఉండటాన్ని గమనించే ఉంటాం. వాటి ఆకారం ఎప్పుడూ గుండ్రంగా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? వాస్తవానికి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం(Scientific reason) ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలం(Ancient times)లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బావి ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడేవారు. నేటికీ బావి నుండి నీటిని తోడుకుని, వాటిని ఉపయోగించే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు బావుల స్థానంలో కుళాయిలు, బోరింగ్ పంపులు(Boring pumps), గొట్టపు బావులు వచ్చాయి.
అయితే ఈ బావులు వృత్తాకారంలో మాత్రమే ఎందుకు ఉన్నాయి? చతురస్రాకారం(square shape), షట్కోణం లేదా త్రిభుజాకారంలో ఎందుకు లేవు? అనే ప్రశ్న మనలో ఉత్పన్నమవుతుంది. నిజానికి బావి జీవితకాలాన్ని(lifetime) పొడిగించడానికే వాటి ఆకారం గుండ్రంగా ఉంటుంది. బావిని చతురస్రం, షడ్భుజి లేదా త్రిభుజం ఆకారంలో కూడా నిర్మించగలిగినప్పటికీ, అలా చేస్తే దాని జీవితకాలం(lifetime) ఎక్కువ కాలం ఉండదు.
మరో ఆకారంలో బావిని నిర్మించినప్పుడు ఆ బావిలో నీరు ఎక్కువగా ఉన్న సందర్భంలో మూలలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ మూలలపై నీటి పీడనం అధికంగా పడుతుంది. ఫలితంగా ఆ మూలల్లో పగుళ్లు ఏర్పడి, బావి మూసుకుపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే వృత్తాకార బావుల్లో ఇటువంటి సమస్య తలెత్తదు. దీనిలో గోడ గుండ్రని ఆకారం కారణంగా నీటి పీడనం(Water pressure) బావి అంతటా ఒకే విధంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ బావులు శతాబ్దాలు(Centuries)గా చెక్కుచెదరకుండా నిలిచివుంటాయి.
Updated Date - 2023-03-09T08:33:23+05:30 IST