ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: రెస్టారెంట్లో ఎవరూ లేరని గ్రహించి వెయిట్రస్ గర్ల్ పై ఇద్దరు కుర్రాళ్ళ వింత చర్య.. చివరకు వాళ్ళకేం జరిగిందో మీరే చూడండి

ABN, First Publish Date - 2023-04-03T10:13:17+05:30

వెయిట్రస్ గర్ల్(waitress girl in restaurant) విషయంలో ఇద్దరు కుర్రాళ్ళ నిర్వాకం.. ఎవరూ లేరు కదా అని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుత కాలంలో అమ్మాయిల మీద ఎక్కడ చూసినా వేధింపులు, దాడులు జరుగుతున్న సంఘటనలు వింటూనే ఉన్నాం. తమ పని తాము చేసుకుంటున్నవారిని తమ వెకిలి చేష్టలతో అకారణంగా వేధిస్తుంటారు అబ్బాయిలు. రెస్టారెంట్లో పనిచేసే వెయిట్రస్ గర్ల్(waitress girl in restaurant) విషయంలో ఇద్దరు కుర్రాళ్ళు అలాగే ప్రవర్తించారు.రెస్టారెంట్లో ఎవరూ లేరు కదా అని ఆమె దగ్గర వారి పైత్యం చూపించారు. ఆ అమ్మాయి వారి చర్యలకు ప్రతిఘటించడంతో ఏకంగా ఆ అమ్మాయి మీద దాడికి దిగారు. కానీ ఎవరూ ఊహించని సంఘటన అక్కడ చోటుచేసుకుంది. రెస్టారెంట్ సీసీకెమెరాలో రికార్డయిన సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఇద్దరు కుర్రాళ్ళు(Two young mans) రెస్టారెంట్ కు వెళ్ళారు.అక్కడ వెయిట్రస్ గా పనిచేసే ఓ అమ్మాయి వాళ్ళకు కావసిన ఆహారాన్ని ఆర్డర్ తీసుకుంది. ఆ తరువాత వారి ఆహారాన్ని బల్లమీద పెట్టి వారికి వడ్డించసాగింది(Food serving). రెస్టారెంట్ లో కస్టమర్ వాళ్ళిద్దరే ఉండటంతో మిగిలిన ఉద్యోగస్తులు ఆ దరిదాపుల్లో లేరు. ఈ విషయం గమనించిన ఆ ఇద్దరు కుర్రాళ్ళు వెయిట్రస్ గర్ల్ ను తమ పక్కన కూర్చోమని, తమతో కలసి తినమని ఒత్తిడి చేశారు. ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఓ కుర్రాడు ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని లాగాడు. ఆ అమ్మాయి కోపంతో చెయ్యి వెనుక్కు లాక్కుని రెండడుగులు వెనక్కు వేసింది. కానీ ఆ కుర్రాళ్ళు రౌడీ వెధవల్లాగా ఆ అమ్మాయి మీద దాడికి దిగారు. తాము కూర్చున్న కుర్చీలలో నుండి లేచి అమ్మాయిని కొట్టడానికి ప్రయత్నించారు.

ఆ కుర్రాళ్ళు ఇద్దరూ తనమీద దాడికి దిగుతుంటే ఆ అమ్మాయి భయపడలేదు. తనకు తెలిసిన ఆత్మరక్షణ విద్యను(Self defance education) వారి ముందు ప్రదర్శించింది. ధైర్యంగా వారిని ఎదుర్కొని పరుగులు తీయించింది. ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఆమెను కొట్టడానికి ఎంత దారుణంగా ప్రయత్నించారో.. అంతకంటే దారుణంగా ఆ అమ్మాయి వారి మీద కిక్కులు, పంచులతో విరుచుకుపడింది. ఆఖరికి ఆ అమ్మాయిని తమ భుజబలంతో ఎదుర్కోలేక ఆమె మీదకు కుర్చీ(chair) విసిరాడొక కుర్రాడు. కానీ ఆ అమ్మాయి చాకచక్యంగా దాన్ని చేతుల్లో ఒడిసిపట్టి తిరిగి తన్నులతో బుద్దిచెప్పింది. రెస్టారెంట్లో అమర్చిన సీసీకెమెరాలో(CC Camera) ఇదంతా రికార్డ్ కావడంతో విషయం బయటకొచ్చింది. caption this అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ అమ్మాయి డిఫెన్స్ ఎడ్యుకేషన్ కు ఫిదా అవుతున్నారు. 'ప్రతి ఆడపిల్లకు అలాంటి విద్య అవసరం' అని అంటున్నారు. 'అమ్మాయిలు ఇలా ధైర్యంగా తమ మీద జరిగే దాడులను ఎదుర్కోవాలి, చాలా దృఢంగా తయారవ్వాలి' అని చెప్పుకొచ్చారు. ఈ అమ్మాయి చాలామంది ఆడపిల్లలకు ప్రేరణ అవుతుందని అంటున్నారు.

Read also: Meaning of Marriage: అమ్మ బాబోయ్.. పెళ్లంటే ఏంటన్న ప్రశ్నకు ఈ పిల్లాడు రాసిన సమాధానం చదివితే అస్సలు నవ్వాపుకోలేరు..!


Updated Date - 2023-04-03T10:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising