ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నిప్పుతో చలగాటం ఆడితే ఇలాగే ఉంటుంది.. ఇతను చేసిన స్టంట్ కాస్తా ఎలా అయ్యిందో చూడండి..

ABN, First Publish Date - 2023-02-05T17:48:08+05:30

సాహసం చెయ్యరా డింబకా అంటాడు పాతాళభైరవిలో యస్వి.రంగారావు.. దాన్ని ఫాలో అవ్వబోయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాహసం చెయ్యరా డింబకా అంటాడు పాతాళభైరవిలో యస్వి.రంగారావు. ఆ మాట మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. అన్ని తరాలు దీన్ని ఫాలో అవుతున్నాయి. ఆ సాహసంలో భాగంగా నిప్పుతో చెలగాటమాడి దారుణమైన అనుభవం చవిచూసాడొక వ్యక్తి. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

నోట్లో కిరోసిన్ పోసుకుని చేతిలో వెలుగుతున్న కర్రను పట్టుకుని మంటలు పైకి ఊదుతూ.. వీధుల్లోనూ, జాతరల్లోనూ స్టంట్ లు చేస్తుంటారు కొందరు. ఓ వ్యక్తి అలా స్టంట్ చెయ్యబోతే పైకి ఎగజిమ్మిన మంటలు కాస్తా అతని గడ్డానికి ఆ తరువాత ముఖానికి వ్యాపించాయి. మంటలు అలా ముఖాన్ని చుట్టుముట్టగానే అతని దగ్గర్లో ఉన్న ఓ వ్యక్తి పరుగు పరుగున వచ్చి అతనికి సహాయం చేసాడు. ఇది పాత వీడియో అయినా ట్విట్టర్ లో వైరల్ అవుతూనే ఉంది. ఈ వీడియో చూసిన వ్యక్తులు 'అతడి అదృష్టం బాగుంది. అందుకే ఆ మంటల నుండి తొందరగానే బయటపడ్డాడు. ఈ సారి ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చెయ్యాలని అనుకుంటే జాగ్గత్తగా ఉండటం మంచిది' అంటున్నారు. ఏదిఏమైనా నిప్పుతో చెలగాటం ఆడకూడదని పెద్దలు ఇలాంటి వాళ్ళను చూసే చెప్పారు కాబోలు.

Updated Date - 2023-02-05T17:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising