ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వృద్ధురాలికి ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న కొండముచ్చు.. ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2023-02-03T21:07:54+05:30

మంచి చేసిన వారిని మరుక్షణమే మరచిపోయే రోజులివి. సాటి మనిషికి మంచి చేయకున్నా.. చివరికి చెడు చేసే వారే ఎక్కువ మంది ఉంటారు. కష్టాల్లో ఉన్న వారిని కన్నెత్తి కూడా చూడని ఈ రోజుల్లో మనుషుల కంటే జంతువులే నయం అని అనిపిస్తుంటుంది. కొన్ని జంతువులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచి చేసిన వారిని మరుక్షణమే మరచిపోయే రోజులివి. సాటి మనిషికి మంచి చేయకున్నా.. చివరికి చెడు చేసే వారే ఎక్కువ మంది ఉంటారు. కష్టాల్లో ఉన్న వారిని కన్నెత్తి కూడా చూడని ఈ రోజుల్లో మనుషుల కంటే జంతువులే నయం అని అనిపిస్తుంటుంది. కొన్ని జంతువులు విశ్వాసానికి మారు పేరుగా నిలవడాన్ని చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కొండముచ్చుకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వృద్ధురాలికి ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న కొండముచ్చు.. ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వృద్ధురాలు రోజూ కొండముచ్చులకు (langur) రొట్టెలు తినిపిస్తూ ఉండేది. అయితే రెండు రోజులగా అనారోగ్య కారణంగా ఆమె రొట్టెలు ఇవ్వలేకపోయింది. దీంతో వృద్ధురాలి (old woman) ఇంటి వద్దకు వచ్చే కొండముచ్చులు నిరాశతో తిరిగి వెళ్తూ ఉండేవి. ఇలా రెండులు చూశాక.. ఓ కొండముచ్చుకు ఎందుకో అనుమానం వచ్చినట్లుంది. ఇంతకీ వృద్ధురాలు ఏం చేస్తుందో చూద్దామనుకుందో ఏమోగానీ ఇంట్లోకి వచ్చింది. మంచంపై పడుకుని ఉన్న వృద్ధురాలిని చూసిన కొండముచ్చుకు విషయం అర్థమైనట్లుంది. వెంటనే ఆమెపై కూర్చుని.. ఆరోగ్యం ఎలా ఉంది.. అన్నట్లుగా చేత్తో తలను నిమురుతుంది. పక్కనే ఉన్న మరో మహిళ.. కొండముచ్చు విశ్వాసాన్ని చూసి దండం పెడుతుంది. వృద్ధురాలిని గట్టిగా కౌగిలించుకున్న కొండముచ్చు.. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొండముచ్చును చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: భూమ్మీద నూకలు మిగిలున్నాయ్.. అంటే ఇదేనేమో.. ఈ మహిళ విషయంలో ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - 2023-02-03T21:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising